FCRA ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలి
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:48 AM
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యూవల్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. నార్పల, గార్లదిన్నెలో మహిళా సంఘాల సభ్యులతో కలిసి సోమవారం ర్యాలీలు నిర్వహించారు.
గార్లదిన్నె, నార్పల, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యూవల్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. నార్పల, గార్లదిన్నెలో మహిళా సంఘాల సభ్యులతో కలిసి సోమవారం ర్యాలీలు నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో పేదలకు ఆర్డీటీ అనేక సేవలు అందిస్తోందని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కదిరప్ప అన్నారు. అలాంటి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యూవల్ చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యూవల్ చేయాలని కోరారు. అనంతరం గార్లదిన్నె డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నరసింహులు, ఓబులపతి, పెన్నోబిలేసు, నాగన్న, చితంబరమ్మ, రోజా, హేమలత, మహిళా సంఘం సభ్యులు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పుల్లన్న పాల్గొన్నారు. నార్పలలో ఆర్డీటీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో పేదలకు అనేక సేవలందిస్తున్న ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...