Share News

rain.. వర్షం రాకతో.. అన్నదాతల హర్షం

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:32 AM

మండలంలోని శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. ముందస్తు వర్షాలకు వేరుశనగ పంటను సాగుచేశారు. తరువాత వర్షం రాకపోవడంతో ఆ పంట ఎండుముఖం పట్టింది.

rain.. వర్షం రాకతో.. అన్నదాతల హర్షం
చీనీతోటలో నిలిచిన నీరు

గార్లదిన్నె, ఆగస్టు8(ఆంధ్రజ్యోతి): మండలంలోని శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. ముందస్తు వర్షాలకు వేరుశనగ పంటను సాగుచేశారు. తరువాత వర్షం రాకపోవడంతో ఆ పంట ఎండుముఖం పట్టింది.


బోరుబావుల్లోనూ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పండ్లతోటలు కూడా ఎండుముఖం పట్టాయి. మర్తాడు, కోటంక, ముకుందాపురం, జంబులదిన్నె కొట్టాల తదితర గ్రామాల్లో పండ్లతోటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురవడంతో ఆయా రైతులు హర్షం వ్యక్తం చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Aug 09 , 2025 | 01:32 AM