Home » Sensex
నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఓపెన్ అయ్యాయి. ఒక పక్క మధ్యప్రాశ్చంలో యుద్ధం తారాస్థాయిలో ఉన్నా భారత మార్కెట్లు ఇవాళ ముందుకు సాగుతున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో మార్కెట్ గ్రీన్ గా కనిపిస్తోంది.
మధ్యప్రాచ్యంలో ఆయిల్ ప్లాంట్లపై జరుగుతోన్న దాడుల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ముడిచమురు ధరలు పెరగడం, గ్లోబల్ మార్కెట్ల పతనంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రూపాయి విలువ కూడా కనిష్టానికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు.
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్ల కొనుగోళ్లు, ఇండియా విక్స్ తగ్గడం మార్కెట్‌కు సానుకూల అంశాలుగా ఉన్నాయి.
మధ్యప్రాశ్చ్యంలో యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలతో అమ్మకాల ఒత్తిడి పెరిగి భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా పతనమయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు, నిఫ్టీ 488.05 పాయింట్లు కోల్పోయాయి.
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల యుద్ద ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెన్సెక్స్ 75 వేల పాయింట్ల దిగువకు పతనమై.. ఆల్ టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిన్న ఐటీ స్టాక్‌ల భారీ పతనం తర్వాత, ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లు మంచి గ్యాప్-అప్ ఓపెనింగ్ ఇచ్చాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ రీబౌండ్ మార్కెట్ సూచీలను బాగా ముందుకు తీసుకెళ్లింది. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు నిఫ్టీ దాదాపు 200 పాయింట్లు పెరిగింది.
ఇవాళ భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటిగంట సమాయానికి 800 పాయింట్లకు పైగా పడిపోయింది. అదే సమయానికి నిఫ్టీ 230 పాయింట్లకు పైగా పతనమైంది.
ఈ వారం ప్రారంభంలో వరుస లాభాలు చవిచూసిన భారత స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు భారీగా నష్టపోయాయి.
భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. వరుసగా నాలుగు సెషన్లను లాభాలతో ముగిసిన నిఫ్టీ సూచీ, వరుసగా మూడు సెషన్లలో లాభాలతో ఎగిసి, నిన్న స్వల్ప నష్టంతో ముగిసిన సెన్సెక్స్ ఇవాళ కింది చూపులు చూశాయి.
గత మూడు సెషన్లలో లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమ ఫలితాలనిచ్చాయి. నిఫ్టీ స్వల్ప లాభాలతో క్లోజ్ అయితే, సెన్సెక్స్ స్వల్ప నష్టంతో ముగిసింది. ఓపెనింగ్‌లో గెయిన్స్, మధ్యలో కొంత తగ్గుదల, చివరికి ఫ్లాట్/మైల్డ్ మూవ్‌మెంట్‌తో ముగిసింది.