3 రోజుల్లో రూ.20 లక్షల కోట్లు
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:09 AM
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో ముడి చమురు ధర 80 డాలర్ల దిగువకు...
పెరిగిన మార్కెట్ సంపద.. సెన్సెక్స్ 544 పాయింట్లు అప్
80 డాలర్ల దిగువకు ముడిచమురు
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో ముడి చమురు ధర 80 డాలర్ల దిగువకు జారుకోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు ర్యాలీ తీయడం ఇందుకు దోహదపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో ఐటీ, ఇంధనం, బ్యాంకింగ్ రంగ షేర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ మరో 544.15 పాయింట్లు బలపడి 76,808.48 వద్దకు చేరింది. నిఫ్టీ 135.25 పాయింట్ల వృద్ధితో 23,989.15 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.75 లక్షల కోట్లు పెరిగి రూ.472.24 లక్షల కోట్లకు (4.99 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. గడిచిన మూడు సెషన్లలో సెన్సెక్స్ 2,975.93 పాయింట్లు (4ు), నిఫ్టీ 827.55 పాయింట్లు (3.57ు) పుంజుకోగా.. మదుపరుల సంపద రూ.19.99 లక్షల కోట్ల మేర పెరిగింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 5 పైసలు బలపడి రూ.94.53 వద్ద ముగిసింది. గడిచిన మూడు సెషన్లలో రూపాయి మారకం విలువ 132 పైసలు పెరిగింది. ముడి చమురు ధరల తగ్గుదల ఇందుకు దోహదపడింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు బ్యారల్ ధర ఒక దశలో 4ు వరకు నష్టపోయి 79.61 డాలర్లకు జారుకుంది. బ్రెంట్ క్రూడ్ 80 డాలర్ల దిగువకు జారుకోవడం మార్చి తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి..
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..
సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..