Share News

సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..

ABN , Publish Date - Jun 16 , 2026 | 03:53 PM

ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో వరుసగా రెండో రోజూ కూడా దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.32 శాతం తగ్గి 82.90 డాలర్లకు చేరుకుంది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (94.56) బలపడింది.

సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..
Stock Market

ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో వరుసగా రెండో రోజూ కూడా దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.32 శాతం తగ్గి 82.90 డాలర్లకు చేరుకుంది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (94.56) బలపడింది. సోమవారం విదేశీ మదుపర్లు రూ.200 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ సానుకూల సంకేతాల నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతోనే రోజును ముగించాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (76,264)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా అదే జోష్‌ను కొనసాగించింది. చివరకు 544 పాయింట్ల లాభంతో 76,808 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 135 పాయింట్ల లాభంతో 23,989 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, కోఫోర్జ్, సుజ్లాన్ ఎనర్జీ, హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ కార్డ్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). నాల్కో, యూనో మిండా, విశాల్ మెగామార్ట్, హిందాల్కో, హ్యుందాయ్ మోటార్స్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 98 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 252 పాయింట్లు ఆర్జించింది.


ఈ వార్తలనూ చదవండి:

కాఫ్‌ సిరప్ కొనాలంటే ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి

ఈ-20 పెట్రోల్‌ వాడితే.. వాహన బీమా తిరస్కరించే చాన్స్‌!

Updated Date - Jun 16 , 2026 | 04:01 PM