కాఫ్ సిరప్ కొనాలంటే ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:56 PM
దగ్గుమందు క్రయవిక్రయాలకు సంబంధించి నిబంధనలను కేంద్రం తాజాగా కఠినతరం చేసింది. ఇకపై కాఫ్‌సిరప్ విక్రయాలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను తప్పనిసరి చేస్తూ డ్రగ్స్ రూల్స్-1945 కింద నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దగ్గు మందు విక్రయాలకు సంబంధించి నిబంధనలను కేంద్రం తాజాగా కఠినతరం చేసింది. ఇకపై కాఫ్‌సిరప్ విక్రయాలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను తప్పనిసరి చేస్తూ డ్రగ్స్ రూల్స్-1945 కింద నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో కాఫ్ సిరప్‌లు షెడ్యూల్ కే డ్రగ్స్ జాబితాలోని క్లాస్ ఆఫ్ డ్రగ్స్ సెక్షన్‌లో 7వ ఎంట్రీగా ఉండేవి. దీంతో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మెడికల్ షాపులు వినియోగదారులకు కాఫ్‌సిరప్‌లను విక్రయించే అవకాశం ఉండేది. ఈ షెడ్యూల్‌కు కేంద్రం తాజాగా మార్పులు చేసింది. కాఫ్ సిరప్‌లను షెడ్యూల్-Kలోని మినహాయింపు జాబితా నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది.
ఈ కొత్త రూల్‌కు సంబంధించిన ముసాయిదా నిబంధనలను కేంద్రం గతేడాది డిసెంబర్‌లోనే విడుదల చేసింది. ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది. అనంతరం, తుది మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ తాజాగా జారీ చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మెడికల్ షాపులన్నీ ఇకపై మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికే సిరప్‌లను విక్రయించాల్సి ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఈ-20 పెట్రోల్ వాడితే.. వాహన బీమా తిరస్కరించే చాన్స్!
అమెరికా ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులెంత?