Share News

అమెరికా ఫ్రీజ్‌ చేసిన ఇరాన్‌ ఆస్తులెంత?

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:57 AM

అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందానికి అంగీకారం కుదిరినా, ఇరాన్‌కు చెందిన స్తంభింపచేసిన ఆస్తుల విడుదల ఇరు దేశాల మధ్య ఓ ప్రతిబంధకంగా మారనుంది. చర్చల ప్రారంభానికి...

అమెరికా ఫ్రీజ్‌ చేసిన ఇరాన్‌ ఆస్తులెంత?

  • 12 బిలియన్‌ డాలర్లా? 24 బిలియన్‌లా?

  • ఒప్పందంలో ప్రతిబంధకంగా ఈ ఆస్తులు

  • ఆస్తుల విడుదలకు అమెరికా ఒప్పుకొందన్న ఇరాన్‌.. అలాంటిది ఏమీ లేదన్న అమెరికా

న్యూఢిల్లీ, జూన్‌ 15: అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందానికి అంగీకారం కుదిరినా, ఇరాన్‌కు చెందిన స్తంభింపచేసిన ఆస్తుల విడుదల ఇరు దేశాల మధ్య ఓ ప్రతిబంధకంగా మారనుంది. చర్చల ప్రారంభానికి ముందే స్తంభింపచేసిన ఇరాన్‌ ఆస్తులు 12 బిలియన్‌ డాలర్లు అమెరికా విడుదల చేస్తుందని ఇరాన్‌కు చెందిన మెహర్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఇరు దేశాల మధ్య 14 పాయింట్ల అవగాహన ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ 60 రోజుల చర్చల కాలంలో 24 బిలియన్‌ డాలర్లను అమెరికా విడుదల చేస్తుందని తెలిపింది. అలాగే, ఇరాన్‌ పునర్నిర్మాణ నిధుల కింద 300 బిలియన్‌ డాలర్లు అందించడానికి ప్రతిపాదత ఒప్పందంలో అమెరికా వాగ్దానం చేసిందని పేర్కొంది. శాంతి ఒప్పందం ప్రకటనకు కొద్ది క్షణాల ముందు ఓ సీనియర్‌ ఇరాన్‌ అధికారి కూడా ఇదే విషయం చెప్పారు. అయితే స్తంభింపచేసిన ఆస్తుల్లో 12 బిలియన్‌ డాలర్లు విడుదల చేయడానికి అమెరికా అంగీకారం తెలపలేదని, ఇరాన్‌ చెపుతున్నది అంతా అవాస్తమని అమెరికా అధికారులను ఉటంకిస్తూ యాక్సియాన్‌ తన కథనంలో పేర్కొంది. ఇరాన్‌ చేసిన వాగ్దాలన్నీ అమలు చేసే వరకు స్తంభింపచేసిన నిధులు విడుదల చేయబోమని ఆ అధికారులు స్పష్టం చేశారు. దీనిని బట్టి ఇరాన్‌ తన అణు, యురేనియం కార్యక్రమాలను ముగించాలనే విషయంలో అమెరికా దృఢంగా నిలబడినట్లు అర్థమవుతోంది. శాంతి ఒప్పందం ప్రకారం ఇరాన్‌ అంగీకరించిన అంశాలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆ దేశ విదేశాంగ సహాయ మంత్రి కాజెమ్‌ ఘరియాబాదీ చెప్పారు. తదుపరి దశ చర్చల్లో తమ దేశానికి నష్టం చేసే ఆంక్షలను ఎత్తివేయడంపై దృష్టి పెడతామని అన్నారు. అయితే స్తంభింపచేసిన ఇరాన్‌ ఆస్తులను విడుదల చేస్తేనే తదుపరి దశ శాంతి చర్చలకు అంగీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం స్విట్జర్లాండ్‌లో శాంతిఒప్పందంపై సంతకాలు జరుగనున్నాయి.

ఇవీ చదవండి:

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

Updated Date - Jun 16 , 2026 | 05:57 AM