సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు
ABN , Publish Date - Jun 12 , 2026 | 03:29 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ రెండు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి.
ఆంధ్రజ్యోతి, జూన్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ రెండు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి. ఇవాళ మార్కెట్స్ ముగిసే సమయానికి 23,622.90 వద్ద నిఫ్టీ ముగియగా, 75,527.95 దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది.
ఉదయం మార్కెట్ ప్రారంభమే లాభాలతో మొదలైంది. రోజంతా కొనుగోలుదారులు పూర్తి పట్టు సాధించడంతో మార్కెట్లు ముగిసే సమయానికి కీలక సూచీలు గరిష్టాల వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1695.41 పాయింట్లు లాభపడి కీలక మైలురాయిని అధిగమించింది, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 461.30 పాయింట్లు పుంజుకుని సరికొత్త రికార్డు స్థాయిల వద్ద వారాంతాన్ని ముగించింది.
పశ్చిమాసియాలో యుద్ధం ముగిసే సూచనలు, అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం, అక్కడ వడ్డీ రేట్ల తగ్గింపుపై సానుకూల అంచనాలు వెలువడటంతో గ్లోబల్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఇది మన దేశీయ మార్కెట్‌కు పెద్ద బూస్ట్‌గా నిలిచింది. గత కొన్ని రోజులుగా ఒడుదొడుకులను ఎదుర్కొంటున్న ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లలో నేడు భారీగా కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా దిగ్గజ సంస్థల షేర్లు మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. గత కొన్ని సెషన్లుగా నికర విక్రయదారులుగా ఉన్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) తిరిగి భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.
టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్స్‌గా నిలువగా, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ (NTPC), మారుతి సుజుకి, సన్ ఫార్మా కొద్దిపాటి నష్టాలతో ముగిశాయి.
ఇవి కూడా చదవండి..
మీనాక్షికి దక్కని ఊరట.. జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ధర్మాసనం
పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్ క్లారిటీ.. ప్రజలు ఓకే అంటేనే..