ఐటీ స్టాక్స్‌లో కలకలం.. 607 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 24,013 వద్ద నిఫ్టీ!
ABN , Publish Date - Jun 19 , 2026 | 04:25 PM
భారత ఈక్విటీ మార్కెట్లకు శుక్రవారం భారీ షాక్ తగిలింది. IT రంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 607 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్లు కోల్పోయాయి.
ఆంధ్రజ్యోతి, జూన్ 18: భారత ఈక్విటీ మార్కెట్లకు శుక్రవారం షాక్ తగిలింది. IT రంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 607 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్లు కోల్పోయాయి. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం 'యాక్సెంచర్' (Accenture) బలహీనమైన ఆదాయ అంచనాలను ప్రకటించడంతో, దాని ప్రభావం దేశీయ IT రంగ షేర్లపై తీవ్రంగా పడింది. అయితే, చివరి అరగంటలో కొంతమేర కోలుకొన్న సూచీలు సెన్సెక్స్ 76,802 పాయింట్ల దగ్గర, నిఫ్టీ కీలకమైన 24,000 మార్క్ వద్ద (24,013 వద్ద) స్థిరపడ్డాయి.
గ్లోబల్ ఐటీ మార్కెట్లో నెలకొన్న మందగమనం, ఐటీ సేవల డిమాండ్‌పై యాక్సెంచర్ వ్యక్తం చేసిన ఆందోళనలు భారతీయ ఐటీ కంపెనీల పెట్టుబడిదారులను కలవరపెట్టాయి. బెంచ్‌మార్క్ సూచీల్లో కీలకమైన ఐటీ ఇండెక్స్ ఈరోజు మార్కెట్లో అత్యధికంగా నష్టపోయింది. నిఫ్టీ 50 ప్యాక్‌లో ఇన్ఫోసిస్ (Infosys), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టెక్ మహీంద్రా (Tech Mahindra) షేర్లు భారీగా నష్టపోయి టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
ఇవి కూడా చదవండి...
హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
వాన్‌పిక్ ఆస్తుల వ్యవహారం.. హైకోర్టులో ఈడీ పిటిషన్ డిస్మిస్
Read Latest Telangana News And Telugu News