Share News

రికార్డులు బద్దలు కొడుతున్న స్పేస్‌ఎక్స్‌

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:01 AM

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌.. అమెరికా స్టాక్‌ మార్కెట్లో రికార్డులు సృష్టిస్తోంది. లిస్టయిన తొలి రోజే 20 శాతం లాభంతో ముగిసిన ఈ కంపెనీ షేరు సోమ, మంగళవారాల్లో...

రికార్డులు బద్దలు కొడుతున్న స్పేస్‌ఎక్స్‌

అమెజాన్‌, మైక్రోసా్‌ఫ్టలను మించిన మార్కెట్‌ క్యాప్‌

న్యూయార్క్‌: ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌.. అమెరికా స్టాక్‌ మార్కెట్లో రికార్డులు సృష్టిస్తోంది. లిస్టయిన తొలి రోజే 20 శాతం లాభంతో ముగిసిన ఈ కంపెనీ షేరు సోమ, మంగళవారాల్లో మరో 23 శాతం పెరిగింది. దీంతో స్పేస్‌ఎక్స్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 2.92 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.275.94 లక్షల కోట్లు)చేరింది. ఇది మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ కంటే ఎక్కువ. మార్కెట్‌ క్యాప్‌పరంగా చూస్తే స్పేస్‌ఎక్స్‌ ప్రస్తుతం అమెరికాలో నాలుగో అతిపెద్ద కంపెనీ. ఈ ఐపీఓతో ఎలాన్‌ మస్క్‌ చరిత్రలో తొలి ట్రిలియనీర్‌గా నిలిచారు. ఒక్కోటి 135 డాలర్లకు జారీ చేసిన ఈ కంపెనీ షేరు ప్రస్తుతం 220 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఇవి కూడా చదవండి..

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..

సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..

Updated Date - Jun 17 , 2026 | 03:01 AM