Share News

సానుకూల సంకేతాలతో మార్కెట్ల ర్యాలీ.. సెన్సెక్స్ 230 పాయింట్లు అప్, జోష్‌లో బ్యాంక్ నిఫ్టీ

ABN , Publish Date - May 22 , 2026 | 04:02 PM

భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతం(శుక్రవారం)ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పైకి కదిలాయి.

సానుకూల సంకేతాలతో మార్కెట్ల ర్యాలీ.. సెన్సెక్స్ 230 పాయింట్లు అప్, జోష్‌లో బ్యాంక్ నిఫ్టీ
Sensex Jumps 230 Points, Nifty Above 23,700: Why Did Stock Market Rally Today

ముంబై, మే 22: భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నాటి ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పైకి కదిలాయి.

నేటి ముగింపు సమయానికి బిఎస్ఇ సెన్సెక్స్ (BSE Sensex) 231.99 పాయింట్లు (0.31%) లాభపడి 75,415.35 వద్ద స్థిరపడగా.. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 (Nifty 50) 64.60 పాయింట్లు (0.27%) పెరిగి 23,719.30 వద్ద ముగిసింది. ట్రేడింగ్ మధ్యలో సెన్సెక్స్ 75,810.97 వద్ద, నిఫ్టీ 23,835.65 వద్ద ఈరోజు గరిష్టాలను తాకాయి.


బ్యాంకింగ్ రంగంలో జోష్: బ్యాంక్ నిఫ్టీ ఈ వారంలో 52,800 స్థాయిల వద్ద గట్టి సపోర్ట్ తీసుకోవడంతో బ్యాంకింగ్ రంగంలో కరెక్షన్ ముగిసి తిరిగి బలం పుంజుకునే సంకేతాలు కనిపించాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు మార్కెట్‌ను భయపెట్టే స్థాయిలో లేకపోవడం కూడా మార్కెట్ కు కలిసిచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈరోజు ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఆటో, ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) రంగాల షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించగా.. ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు స్వల్ప లాభాల స్వీకరణకు (Profit Booking) గురయ్యాయి. ఐటీ (IT) రంగంలో వరుసగా మూడో రోజు ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. లార్జ్‌క్యాప్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఈరోజు కాస్త వెనుకంజలో ఉన్నాయి.


Also Read:

వడదెబ్బ ఎఫెక్ట్.. తెలంగాణ వ్యాప్తంగా 22 మంది మృతి

తండ్రి మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం? జగన్ తీరుపై మంత్రి గొట్టిపాటి ధ్వజం

Updated Date - May 22 , 2026 | 04:27 PM