తండ్రి మరణంపైనా రాజకీయాలా? జగన్‌పై మంత్రి గొట్టిపాటి ధ్వజం
ABN , Publish Date - May 22 , 2026 | 11:59 AM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా దిగుతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అమరావతి, మే 22: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా దిగుతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత తండ్రి మరణాన్ని సైతం రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం జగన్‌కే చెల్లిందని, ఆయన వైఖరి అత్యంత బాధాకరమని విమర్శించారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జగన్ గత ఐదేళ్ల పాలనపై, ఆయన రాజకీయ శైలిపై నిప్పులు చెరిగారు.
మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. ‘తండ్రి చావును కూడా రాజకీయ ప్రయోజనాలకు జగన్ వాడుకోవటం బాధాకరం. 5ఏళ్లు సీఎంగా ఉండి తండ్రి, బాబాయ్ హత్యపై అనుమానాలు ఎందుకు నివృత్తి చేయలేదు. అధికాకంలో ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించి, ఇప్పుడు అధికారం పోయేసరికి ప్రజల్లో సానుభూతి కోసం 'బీద ఏడుపులు' ఏడవడం జగన్‌కే చెల్లింది. ప్రజల్లో సానుభూతి పొందే ఆలోచనలు విరమించుకుని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమైతే జగన్ కే మంచిది. జగన్ పరిపాలన, అరాచకాలను అసహ్యించుకునే.. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. చంద్రబాబు నిర్ణయాలు నేటి తరంతో పాటు భవిష్యత్తు తరాలకూ ఉపయోగపడేలా ఉంటాయి. మూడు రాజధానులంటూ ప్రజల్లో తిరస్కరణకు గురయ్యారు.. ఇప్పుడు అమరావతి అభివృద్ది చూసి ఓర్వలేక మావిగన్ అంటూ వితండవాదం చేస్తున్నారు. రాష్ట్రానికి, రాష్ట్రప్రజలకూ నష్టం చేసే నిలకడలేని జగన్ మాటలను ఎవరూ విశ్వసించరు’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వాటర్ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్