Home » Sachin Tendulkar
భారత క్రికెట్‌లో మూడు తరాల స్టార్ ప్లేయర్లను ఒకే ఫ్రేమ్‌లో చూపిస్తూ వింబుల్డన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కింగ్ విరాట్ కోహ్లీ, ప్రిన్స్ శుభ్‌మన్ గిల్ వింబుల్డన్ వీక్షించిన ఫొటోలను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి జగజ్జేతగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.
భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అయితే సచిన్, వైభవ్ అరంగేట్రాల మధ్య వయసు తేడా మాత్రమే కాదు.. రెండు తరాల క్రికెట్, సాంకేతికత, అభిమానుల తీరు, ఆట శైలిలోనూ విపరీతమైన మార్పు వచ్చింది.
మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ఓ కీలక ముందడుగు వేసింది. ప్రసవం తర్వాత కూడా మైదానంలోకి అడుగుపెట్టేందుకు ‘రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ’ గైడ్‌లైన్స్‌ను రూపొందించింది. ఐసీసీ ప్రకటించిన ఈ మార్గదర్శకాలను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వాగతించాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, కోచ్ జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
ఆటకు వీడ్కోలు పలికినప్పటికీ.. క్రికెట్‌పై తనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని సచిన్ టెండూల్కర్ మరోసారి నిరూపించాడు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తూ క్రికెట్ ఆడాడు. ఈ సరదా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ ప్రభావం ప్రతి జట్టుపై పడిందని.. ప్రత్యర్థి జట్లకు అతడు భయాన్ని పరిచయం చేశాడని అన్నాడు.
తాజా ఐపీఎల్‌లో అదరగొట్టిన పదిహేనేళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఆడగలడా? ఫోర్లు, సిక్స్‌లతో దుమ్మురేపే వైభవ్.. నెమ్మదైన ఆటలో మెప్పించగలడా? ఈ ప్రశ్నలకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సమాధానం చెప్పాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం లఖ్ నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో యువ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. మైదానంలో కుమారుడిని చూసి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భావోద్వేగానికి గురయ్యారు.
పనిపై దృష్టిపెడితే ఒత్తిడి అధిగమించే అవకాశం ఉంటుందని క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం వల్లే తాను ఒత్తిడిని అధిగమించి క్రికెట్‌లో రాణించగలిగినట్లు చెప్పారు.