Share News

ఒకే ఫ్రేమ్‌లో సచిన్, కోహ్లీ, గిల్.. వింబుల్డన్ పోస్ట్ వైరల్!

ABN , Publish Date - Jul 11 , 2026 | 09:49 AM

భారత క్రికెట్‌లో మూడు తరాల స్టార్ ప్లేయర్లను ఒకే ఫ్రేమ్‌లో చూపిస్తూ వింబుల్డన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కింగ్ విరాట్ కోహ్లీ, ప్రిన్స్ శుభ్‌మన్ గిల్‌ వింబుల్డన్ వీక్షించిన ఫొటోలను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఒకే ఫ్రేమ్‌లో సచిన్, కోహ్లీ, గిల్.. వింబుల్డన్ పోస్ట్ వైరల్!
Wimbledon 2026

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో మూడు తరాల స్టార్ ప్లేయర్లను ఒకే ఫ్రేమ్‌లో చూపిస్తూ వింబుల్డన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కింగ్ విరాట్ కోహ్లీ, ప్రిన్స్ శుభ్‌మన్ గిల్‌ వింబుల్డన్ వీక్షించిన ఫొటోలను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 2015లో సెంటర్ కోర్టులో సచిన్, కోహ్లీ కలిసి మ్యాచ్ వీక్షించిన ఫొటోతో పాటు, 2026లో సచిన్ పక్కనే శుభ్‌మన్ గిల్ కూర్చున్న ఫొటోను కలిపి వింబుల్డన్ ప్రత్యేక కొలాజ్‌ను పంచుకుంది. ‘సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్.. ఒకే చిత్రంలో భారత క్రికెట్ మూడు తరాల రాయల్టీ’ అంటూ వింబుల్డన్ ఎక్స్‌లో క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌ క్రికెట్, టెన్నిస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.


రాయల్ బాక్స్‌లో క్రికెట్ దిగ్గజాలు

వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో సచిన్‌తో పాటు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా కూడా సందడి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ఈ ఇద్దరు దిగ్గజాలు మరోసారి ఒకే వేదికపై కనిపించడం అభిమానులను అలరించింది. భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా సెమీఫైనల్ మ్యాచ్‌లను వీక్షించాడు. ఫుట్‌బాల్ స్టార్, నెదర్లాండ్స్, లివర్‌పూల్ కెప్టెన్ వర్జిల్ వాన్ డైక్‌తో పాటు లీడ్స్ యునైటెడ్ ఛైర్మన్ పరాగ్ మరాఠే కూడా రాయల్ బాక్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


క్రీడలంటే ప్రేమ పెరుగుతోంది: సచిన్

వింబుల్డన్ మ్యాచ్‌ అనంతరం సచిన్ సోషల్ మీడియాలో స్పందించాడు. ‘వింబుల్డన్ ఎప్పుడూ నిరాశపరచదు. రెండు అద్భుతమైన సెమీ ఫైనల్స్‌ను ప్రత్యక్షంగా చూడటం అదృష్టంగా భావిస్తున్నా. ఫెరీ పోరాటం అద్భుతంగా ఉంది. జ్వెరెవ్ సర్వీస్ అతడి విజయానికి కీలకమైంది. అనంతరం సినర్ పవర్, నియంత్రణ కలగలిపిన ఆట అసాధారణం. జకోవిచ్ చివరి వరకు పోరాడినా సినర్ అత్యుత్తమ స్థాయిలో ఆడాడు. ఇలాంటి రోజులే క్రీడలపై మరింత ప్రేమను పెంచుతాయి. సెంటర్ కోర్టులో ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీతో గంభీర్ సుదీర్ఘ చర్చ.. వీడియో వైరల్!

ఫిఫా ప్రపంచ కప్ 2026: సెమీస్‌కి దూసుకెళ్లిన స్పెయిన్

Updated Date - Jul 11 , 2026 | 09:49 AM