Share News

వైభవ్ సూర్యవంశీతో గంభీర్ సుదీర్ఘ చర్చ.. వీడియో వైరల్!

ABN , Publish Date - Jul 11 , 2026 | 07:24 AM

వైభవ్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సహాయ కోచ్ సితాన్షు కోటక్.. వైభవ్‌తో సుదీర్ఘ చర్చ పెట్టారు. అతడి ఆటలోని లోపాలు, ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే విధానంపై సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

వైభవ్ సూర్యవంశీతో గంభీర్ సుదీర్ఘ చర్చ.. వీడియో వైరల్!
Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన అతడు.. ఆడిన మూడు మ్యాచుల్లోనూ పెద్దగా రాణించలేకపోయాడు. స్టార్ ఓపెనర్ సంజు శాంసన్‌ను తప్పించి అతడి స్థానంలో వైభవ్‌కు అవకాశం కల్పించడంతో టీమ్ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైభవ్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సహాయ కోచ్ సితాన్షు కోటక్.. వైభవ్‌తో సుదీర్ఘ చర్చ పెట్టారు. అతడి ఆటలోని లోపాలు, ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే విధానంపై సూచనలు చేసినట్లు తెలుస్తోంది.


‘వైభవ్.. ప్రతి బంతికి రిస్క్ తీసుకుని భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించకు. పిచ్‌ను అర్థం చేసుకో. ఆ తర్వాత పరిస్థితులకు తగ్గట్లు ఆడు. తొందరపడి ఔట్ అవ్వకు’ అని ఆ వీడియోలో గంభీర్ వైభవ్‌కు చెప్తున్నట్లు ఉంది. టీ20 ప్రపంచకప్ 2026లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజు శాంసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన 15 ఏళ్ల సూర్యవంశీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో 14, 13, 15 పరుగులకే పరిమితమై నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లు అతడి షార్ట్ బాల్ బలహీనతను లక్ష్యంగా చేసుకోవడంతో పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మరోవైపు ఇతర బ్యాటర్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను చేజార్చుకుంది.


ఇవి కూడా చదవండి:

లార్డ్స్‌లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

Updated Date - Jul 11 , 2026 | 07:24 AM