Share News

మంధాన జోరు

ABN , Publish Date - Jul 11 , 2026 | 03:33 AM

ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో ప్రారంభమైన ఏకైక టెస్టులో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (83) మెరిసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (58), దీప్తి శర్మ (57) అర్ధసెంచరీలతో...

మంధాన జోరు

  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 285 ఆలౌట్‌

  • హర్మన్‌, దీప్తి హాఫ్‌ సెంచరీలు

  • ఇంగ్లండ్‌ మహిళలతో ఏకైక టెస్టు

లండన్‌: ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో ప్రారంభమైన ఏకైక టెస్టులో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (83) మెరిసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (58), దీప్తి శర్మ (57) అర్ధసెంచరీలతో రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో శుక్రవారం తొలి రోజు ఆటలో భారత్‌ 285 పరుగులకు ఆలౌటైంది. జెమీమా (35) ఫర్వాలేదనిపించింది. సోఫీ ఎకెల్‌స్టోన్‌కు మూడు.. ఫిలెర్‌, వాంగ్‌, విల్లీర్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 21/1 స్కోరుతో నిలిచింది. క్రీజులో ఓపెనర్‌ బౌచిర్‌ (17 బ్యాటింగ్‌), హీథర్‌ నైట్‌ (1 బ్యాటింగ్‌) ఉన్నారు.

ఆదుకున్న సీనియర్లు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ మంధాన సంయమన ఆటతీరుతో ఆకట్టుకుంది. యాస్తిక (12)తో కలిసి రెండో వికెట్‌కు 33, జెమీమాతో కలిసి మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించింది. ఆ తర్వాత మంధానకు కెప్టెన్‌ హర్మన్‌ అండగా నిలవగా.. నాలుగో వికెట్‌కు ఈ ఇద్దరూ 89 పరుగులు జోడించారు. అయితే మంధాన నిష్క్రమణతో జట్టు తడబడింది. చివర్లో దీప్తి నిలిచినా.. సహకరించేవారు కరువయ్యారు.

భారత్‌: 74.5 ఓవర్లలో 285 (మంధాన 83, హ ర్మన్‌ 58, దీప్తి 57; ఎకెల్‌స్టోన్‌ 3/68, ఫిలెర్‌ 2/40)

ఇంగ్లండ్‌: 11 ఓవర్లలో 21/1 (బౌచిర్‌ 17 బ్యాటింగ్‌; క్రాంతి 1/8)

ఇవి కూడా చదవండి:

లార్డ్స్‌లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

Updated Date - Jul 11 , 2026 | 03:33 AM