Share News

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

ABN , Publish Date - Jul 10 , 2026 | 03:16 PM

టీ20 ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించిన భారత మహిళల జట్టు.. మరో కీలక పోరులో బరిలోకి దిగనుంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో.. ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు
India Women vs England Women

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించిన భారత మహిళల జట్టు.. మరో కీలక పోరులో బరిలోకి దిగనుంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడనుంది. శుక్రవారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో.. ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత మహిళలు తొలుత బ్యాటింగ్‌కు దిగనున్నారు. అయితే లార్డ్స్ మైదానంలో భారత మహిళా జట్టుకు ఇదే తొలి టెస్టు కావడం విశేషం. తొలిసారిగా లార్డ్స్ మైదానంలో తొలి టెస్టు ఆడుతూ భారత మహిళలు చరిత్ర సృష్టించారు. కాగా భారత్ తరఫున టీ20 ప్రపంచ నం.1 బౌలర్ శ్రీచరణి టెస్టుల్లో అరంగేట్రం చేయనుంది. ఇంగ్లండ్ తరఫున క్యాప్సీ, మ్యాడీ డెబ్యూ చేయనున్నారు. అయితే మహిళల టెస్టు నాలుగు రోజులే జరగనుంది.


ఇంగ్లండ్ తుది జట్టు:

నాట్ సీవర్ బ్రంట్(కెప్టెన్), టామీ బీమౌంట్, మియా బౌచీర్, హీథర్ నైట్, క్యాప్సీ, అమీ జోన్స్(వికెట్ కీపర్), మ్యాడీ, సోఫీ ఎకిల్‌స్టన్, ఇస్సీ వాంగ్, లారెన్ బెల్, లారెన్ ఫైలర్

భారత్ తుది జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, సయాలీ, శ్రీచరణి, క్రాంతి గౌడ్


ఇవి కూడా చదవండి:

టీమిండియా ఓటములపై బీసీసీఐ సీరియస్.. గంభీర్, శ్రేయస్ పదవులపై సమీక్ష!

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు చేపాక్ వేదిక.. కొత్త చరిత్రకు సిద్ధమైన చెన్నై..

Updated Date - Jul 10 , 2026 | 03:26 PM