టీమిండియా ఓటములపై బీసీసీఐ సీరియస్.. గంభీర్, శ్రేయస్ పదవులపై సమీక్ష!
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:55 PM
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్2026 ఛాంపియన్‌గా అవతరించిన కొద్దిరోజుల్లోనే టీమిండియా ప్రదర్శన ఘోరంగా దిగజారింది. వరుస ఓటముల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్2026 ఛాంపియన్‌గా అవతరించిన కొద్దిరోజుల్లోనే టీమిండియా ప్రదర్శన ఘోరంగా దిగజారింది. ఇటీవలే ఐర్లాండ్ పర్యటనలో 2-0 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన తర్వాత, తాజాగా ఇంగ్లండ్ పర్యటనలోనూ అదే పునరావృతమైంది. బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో.. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-3తో చేజార్చుకుంది. దీంతోటీమిండియాపై బీసీసీఐ (BCCI) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో ఓడిన భారత్, మూడో టీ20లో కనీస పోరాటం లేకుండా 202 పరుగుల ఛేదనలో కేవలం 76 పరుగులకే కుప్పకూలి 125 పరుగుల భారీ ఓటమిని చవిచూసింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో జట్టు పూర్తిగా తేలిపోయింది. వరుస పరాజయాల నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం పనితీరుపై బీసీసీఐ సమగ్ర సమీక్ష (Performance Review) చేపట్టాలని నిర్ణయించింది.
హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాంట్రాక్ట్ 2027 వరకు ఉన్నప్పటికీ, ప్రస్తుత వైఫల్యాల నేపథ్యంలో అతని స్థానంపై కూడా బోర్డు ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రపంచకప్ అందించిన సీనియర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి, శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించాలనే బీసీసీఐ తీసుకున్న సాహసోపేత నిర్ణయం కాస్తా ఇప్పుడు రివర్స్ అయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో జట్టు మేనేజ్‌మెంట్‌లో మరికొన్ని కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని క్రీడా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
క్యాచ్ పూర్తికాకముందే క్రీజు నుంచి వెళ్లిపోయిన వైభవ్.. వీడియో వైరల్
మరోసారి నిరాశే ఎదురైంది.. ఓటమిపై స్పందించిన శ్రేయస్
ఇవి కూడా చదవండి:
ఆసీస్ ‘బిగ్‌బాష్’కు చేపాక్ వేదిక.. కొత్త చరిత్రకు సిద్ధమైన చెన్నై..
క్యాచ్ పూర్తికాకముందే క్రీజు నుంచి వెళ్లిపోయిన వైభవ్.. వీడియో వైరల్