Share News

ప్రశ్న రావణ్, ప్రకాశ్ రాజ్, జడ శ్రవణ్‌లు పెయిడ్ ఆర్టిస్ట్‌లు: జనసేన ఎమ్మెల్యే

ABN , Publish Date - Jul 10 , 2026 | 01:44 PM

ఏపీలో మత ఘర్షణలకు వైసీపీ కుట్ర పన్నుతోందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. వైసీపీ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.

ప్రశ్న రావణ్, ప్రకాశ్ రాజ్, జడ శ్రవణ్‌లు పెయిడ్ ఆర్టిస్ట్‌లు: జనసేన ఎమ్మెల్యే
JanaSena MLA

విశాఖపట్నం, జులై 10: రాష్ట్రంలో మత ఘర్షణలకు వైసీపీ కుట్ర పన్నుతోందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ కుట్రలను ప్రజలు గమనించాలన్నారు. సనాతన ధర్మం, హిందుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జడ శ్రవణ్ ఏలూరులో సభ పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారన్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్, నటుడు ప్రకాశ్ రాజ్‌కు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. ప్రశ్న రావణ్, ప్రకాశ్ రాజ్, జడ శ్రవణ్‌ పెయిడ్ ఆర్టిస్ట్‌లు అని వ్యాఖ్యానించారు.


దేశంలో ఘర్షణలు సృష్టించాలనే కుట్రలు జరుగుతున్నాయని జనసేన ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టే కుట్రను పోలీసులు ఛేదించాలన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్న వారికి తాడేపల్లి నుంచి ఉన్న సంబంధాలు బయటపెట్టాలన్నారు. ఏపీలో అన్ని మతాలు, కులాలకు గౌరవం ఇస్తున్నామని చెప్పారు. జగన్‌కు వ్యతిరేకంగా రూ.25 కోట్లు ఖర్చుపెట్టానని అంటున్న జడ శ్రవణ్‌కు ఆ డబ్బులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న దేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. సనాతన ధర్మం, హిందుత్వంపై కుట్ర పన్నితే వదిలే ప్రసక్తే లేదని విజయ్ కుమార్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

‘మావిగన్ అంటే మామిడి పండు అనుకుంటున్నారామో’.. జగన్‌పై చింతా మోహన్ సెటైర్

అధిక లాభాల పేరుతో ఖాతాదారులకు టోకరా.. ఆల్మైటి జెనిసెస్ డైరెక్టర్ల అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2026 | 01:48 PM