Share News

వైభవ్ కోసం సంజును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు: పార్థివ్ పటేల్

ABN , Publish Date - Jul 10 , 2026 | 02:56 PM

భారత టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 హీరో సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఈ విషయంపై మాట్లాడాడు.

వైభవ్ కోసం సంజును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు: పార్థివ్ పటేల్
Sanju Samson

ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 హీరో సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై చర్చ కొనసాగుతూనే ఉంది. యువ బ్యాటర్ వైభవ్ సూర్యంశీ కోసం సంజును తప్పించారనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్.. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో సంజును తప్పించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఈ విషయంపై మాట్లాడాడు.


‘గత 11-12 ఏళ్లుగా సంజు శాంసన్ కెరీర్‌ను చూస్తే అతడిని వెంటాడిన ఒకే ఒక్క ప్రశ్న నిలకడ. గతంలో అతడి అస్థిర ప్రదర్శనల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కానీ ఇప్పుడు ఎందుకు సంజునే పక్కన పెట్టారనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం ఒక రకంగా సరైన నిర్ణయం కావచ్చు. అయితే పూర్తిగా తార్కికంగా చూస్తే సంజు శాంసన్‌ను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదు. వైభవ్ కోసం సంజును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు. జట్టులో లేని ఆటగాడే మెరుగ్గా ఆడేవాడని మనం ఎప్పుడూ భావిస్తుంటాం. గత టీ20 ప్రపంచ కప్ సమయంలో శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో అతడినే కోరారు. ఇప్పుడు అతడు జట్టులోకి రాగానే ఆర్సీబీకి రెండుసార్లు కప్ అందించిన కెప్టెన్ రజత్ పాటీదార్‌కు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఇలాంటి చర్చలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి’ అని పార్థివ్ పటేల్ వెల్లడించాడు.


ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కోల్పోయింది. ఒక మ్యాచ్ రద్దు కాగా, మూడు మ్యాచుల్లో ఘోర ఓటమిపాలైంది. నామమాత్రపు ఐదో టీ20 జులై 11న జరగనుంది.


ఇవి కూడా చదవండి:

టీమిండియా ఓటములపై బీసీసీఐ సీరియస్.. గంభీర్, శ్రేయస్ పదవులపై సమీక్ష!

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు చేపాక్ వేదిక.. కొత్త చరిత్రకు సిద్ధమైన చెన్నై..

Updated Date - Jul 10 , 2026 | 03:20 PM