సెమీస్‌లో ఫ్రాన్స్
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:36 AM
ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ అద్వితీయ ఆట కొనసాగుతోంది. కిలియన్ ఎంబాపె, ఉస్మాన్ డెంబెలె మెరిసిన వేళ టైటిల్ దిశగా మరో అడుగు వేసింది. గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో...
ఇంగ్లండ్ X నార్వే
(ఆదివారం తెల్లవారుజాము 2.30)
అర్జెంటీనాX స్విట్జర్లాండ్
(ఆదివారం ఉదయం 6.30)
క్వార్టర్స్‌లో మొరాకోపై గెలుపు
ఎంబాపె మరో గోల్
ఫిఫా వరల్డ్ కప్
ఈసారి వరల్డ్ కప్‌లో అర్జెంటీనా దిగ్గజం మెస్సీతో గోల్స్‌లో పోటీపడుతున్న స్టార్ ఒకే ఒక్కడు. అతడే ఫ్రాన్స్ కెప్టెన్, ప్రపంచ అత్యుత్తమ ఫార్వర్డ్ కిలియన్ ఎంబాపె. మొరాకోతో క్వార్టర్‌పైనల్‌లో 27 ఏళ్ల ఎంబాపె తొలి గోల్ కొట్టి ఫ్రాన్స్‌ను ఆధిక్యంలో నిలిపాడు.
ఫాక్స్‌బరో (యూఎస్) : ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ అద్వితీయ ఆట కొనసాగుతోంది. కిలియన్ ఎంబాపె, ఉస్మాన్ డెంబెలె మెరిసిన వేళ టైటిల్ దిశగా మరో అడుగు వేసింది. గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 2-0తో మొరాకోను ఫ్రాన్స్ చిత్తు చేసింది. ఎంబాపె 60వ నిమిషంలో, ఉస్మాన్ 66వ నిమిషంలో ఫ్రాన్స్ తరపున గోల్స్ సాఽధించారు. ఇక..2022 ఖతార్ ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఫ్రాన్స్ ఇదే స్కోరు తేడాతో మొరాకోను ఓడించడం గమనార్హం. మ్యాచ్ ఆరంభం నుంచి ఫ్రాన్స్ పట్టు బిగించింది. ఈ క్రమంలో 26వ నిమిషంలో ఆ జట్టుకు పెనాల్టీ కిక్ లభించింది. కానీ ఎంబాపె షాట్‌ను మొరాకో కీపర్ యాసిన్ అడ్డుకున్నాడు. ప్రథమార్థమంతా ఆధిపత్యం చెలాయించి పలు అవకాశాలను ఫ్రాన్స్ సృష్టించుకున్నా..గోల్ మాత్రం చేయలేకపోయింది. ద్వితీయార్థం..60వ నిమిషంలో ఎంబాపె అద్భుత గోల్‌తో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. డి బాక్సువద్ద బంతిని దొరకబుచ్చుకున్న కిలియన్.. ప్రత్యర్థి డిఫెండర్లకు అందకుండా కొట్టిన షాట్ రివ్వున గోల్‌పో్‌స్టలోకి దూసుకు పోయింది. మరో ఆరు నిమిషాల తర్వాత ఎంబాపె అందించిన పాస్‌ను బాక్స్ అంచునుంచి కుడి పాదంతో ఉస్మాన్ డెంబెలె గోల్‌పో్‌స్టలోకి కొట్టాడు.
ఎంబాపెకు గాయం ?: అయితే కుడి పాదం నొప్పితో మ్యాచ్ ద్వితీయార్థంలో 27 ఏళ్ల ఎంబాపె మైదానం వీడాడు. మొరాకో డిఫెండర్ ఇస్సా..ఎంబాపె పాదంపై కాలు వేయడంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. దాంతో చికిత్స తీసుకున్నా నొప్పి తగ్గకపోవడంతో మైదానం వీడాడు. ఆపై అతడు బరిలోకి దిగలేదు. దాంతో ఫ్రాన్స్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ అది గాయం కాదని, తాను బాగానే ఉన్నానని తర్వాత ఎంబాపె ప్రకటించడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.
జోరు కొనసాగిస్తుందా?
ఇంగ్లండ్‌తో నార్వే క్వార్టర్‌ఫైనల్స్ నేడు
మయామీ గార్డెన్స్ (యూఎస్) : నార్వే-ఇంగ్లండ్ జట్లు ఆదివారం తెల్లవారుజామున జరిగే క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో అమీతుమీకి సిద్ధమయ్యాయి. రౌండ్-32లో..ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను మట్టికరిపించిన నార్వే ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తోంది. స్ట్రయికర్ హాలాండ్ అదే జోరు కొనసాగిస్తే నార్వే మరో సంచలనం సృష్టించగలదు. ఇంకోవైపు సూపర్ ఫామ్‌లో ఉన్న హ్యారీ కేన్, జూడ్ బెలింగ్‌హామ్ అండగా టోర్నీలో ముందంజ వేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
8
ఈసారి మెగా టోర్నీలో ఎంబాపె గోల్స్ సంఖ్య. మెస్సీతో సమంగా నిలిచాడు.
20
వరల్డ్ కప్ కెరీర్‌లో కిలియన్ గోల్స్ సంఖ్య
3
ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ సెమీ్‌సకు చేరడం వరుసగా మూడోసారి
ఇవి కూడా చదవండి:
లార్డ్స్‌లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత
భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు