Share News

స్పెయిన్ యువ సంచలనం అరుదైన ఘనత.. పీలేకు కూడా సాధ్యం కాలేదు!

ABN , Publish Date - Jul 11 , 2026 | 08:59 AM

ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంపై స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

స్పెయిన్ యువ సంచలనం అరుదైన ఘనత.. పీలేకు కూడా సాధ్యం కాలేదు!
Lamine Yamal

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంపై స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. బెల్జియంతో జరిగిన క్వార్టర్ ‌ఫైనల్ మ్యాచ్‌తో ప్రపంచ కప్‌లో 18 ఏళ్ల లోపు ఆటగాడిగా అత్యధిక మ్యాచ్‌లు (6) ఆడిన ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతను బ్రెజిల్ దిగ్గజం పీలే కూడా తన కెరీర్‌లో అందుకోలేకపోవడం విశేషం.


ఇప్పటికే గ్రూప్ దశలో సౌదీ అరేబియాపై గోల్ చేసి ప్రపంచ కప్‌లో గోల్ సాధించిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా యమాల్ నిలిచాడు. ఈ జాబితాలో 1958 ప్రపంచ కప్‌లో గోల్ చేసిన పీలే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.


బెల్జియంతో జరిగిన క్వార్టర్‌ఫైనల్ తొలి అర్ధభాగం 1-1తో సమమైంది. 30వ నిమిషంలో ఫాబియన్ రుయిజ్ గోల్‌తో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లగా, 41వ నిమిషంలో చార్లెస్ డి కెటెలారే హెడ్డర్‌తో బెల్జియానికి సమం చేశాడు. ఈ గోల్‌తో స్పెయిన్ గోల్‌ కీపర్ ఉనాయ్ సిమోన్ ప్రపంచ కప్‌లో వరుసగా 650 నిమిషాల పాటు గోల్ ఇవ్వకుండా కొనసాగించిన అద్భుత రికార్డుకు తెరపడింది. ఖతార్ ప్రపంచ కప్ నుంచి కొనసాగుతున్న ఈ అరుదైన రికార్డును కెటెలారే చెక్ పెట్టాడు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీతో గంభీర్ సుదీర్ఘ చర్చ.. వీడియో వైరల్!

ఫిఫా ప్రపంచ కప్ 2026: సెమీస్‌కి దూసుకెళ్లిన స్పెయిన్

Updated Date - Jul 11 , 2026 | 08:59 AM