ఫిట్‌నెస్ ఐకాన్‌గా విరాట్ కోహ్లీ.. మార్పు వెనుక అసలు స్టోరీ ఇదే!
ABN , Publish Date - Aug 05 , 2026 | 07:39 PM
టీమిండియా స్టార్ ప్లేయర్, కింగ్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో చాలా చురుకుదనం ఉంటూ, కఠినమైన శిక్షణతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కోహ్లీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్, కింగ్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో చాలా చురుకుదనం ఉంటూ, కఠినమైన శిక్షణతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కోహ్లీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అయితే ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే కోహ్లీ కూడా.. ఒకప్పుడు ఇతర కుర్రాళ్లలాగే చోలే భటూరే, బ్రెడ్ పకోడా, పన్నీర్ ఖుర్చన్, కాస్సాటా ఐస్‌క్రీమ్ వంటి ఆహార పదార్ధాలను ఓ రేంజ్ లో తినేవాడు. అలాంటి ఆహార ప్రియుడైన కోహ్లీలో ఈ మార్పు ఎలా వచ్చింది? దీని వెనుక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో జరిగిన ఓ సమావేశానికి కారణమైంది. మరి.. ఆ ఇంట్రస్టింగ్ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం...
2022లో కోహ్లీ తన 100వ టెస్ట్ మ్యాచ్ ఆడిన సందర్భంగా బీసీసీఐ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో సచిన్ మాట్లాడుతూ.. 2011లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కాన్‌బెర్రాలో ఉన్న ఒక థాయ్ రెస్టారెంట్‌కు వెళ్లడం కోహ్లీకి ఎంతో ఇష్టమని సచిన్ తెలిపారు. అయితే, ఒకరోజు రాత్రి భారీగా భోజనం చేసిన తర్వాత కోహ్లీ, సచిన్‌తో కలిసి కాసేపు నడకకు వెళ్లాడు. ఆ సమయంలో విరాట్‌లో ఊహించని మార్పు వచ్చింది.
'అన్న.. చాలా అయింది. ఇక నుంచి పూర్తిగా ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టాలి. నా లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల నాకు వచ్చేసింది' అని కోహ్లీ తనతో అన్నట్లు సచిన్ వెల్లడించారు. ఆనాడు కోహ్లీలో వచ్చిన ఆ చిన్న ఆలోచనే అతడి జీవన శైలిని పూర్తిగా మార్చేసిందట. అనారోగ్యకరమైన అలవాట్లకు స్వస్తి చెప్పి, కఠినమైన డైట్, క్రమశిక్షణతో కూడిన దినచర్యను అలవర్చుకున్న విరాట్.. నేడు ప్రపంచంలోని అత్యంత ఫిట్టెస్ట్ అథ్లెట్లలో ఒకరిగా ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
వన్డే ప్రపంచకప్-2027 క్వాలిఫైయర్ షెడ్యూల్ ఖరారు..
సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. సందేశం ఇచ్చిన రహానే