వన్డే ప్రపంచకప్-2027 క్వాలిఫైయర్ షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలివే!
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:48 PM
వన్డే ప్రపంచకప్ 2027 క్వాలిఫైయర్ టోర్నమెంట్ తేదీలను ఐసీసీ ఖరారు చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా వచ్చే ఏడాది అక్టోబర్‌లో మెగా టోర్నీ జరగనుంది.
స్పోర్ట్స్ డెస్క్: 2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఖరారు చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా వచ్చే ఏడాది అక్టోబర్‌లో మెగా టోర్నీ జరగనుంది. దీని కోసం జరిగే ఈ అర్హత మ్యాచ్‌లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే, ఈ క్వాలిఫైయర్ మ్యాచ్‌లకు వేదికలను మాత్రం ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఈ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఇందులో విజేతగా నిలిచిన జట్టు నేరుగా ప్రపంచకప్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది. అలాగే రెండు, మూడు, నాల్గవ స్థానాల్లో నిలిచిన జట్లు ప్రపంచకప్ తొలి దశలో భాగంగా 'సూపర్ సిరీస్' మ్యాచ్‌ల్లో పోటీపడతాయి. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అట్టడుగున నిలిచిన రెండు పూర్తి స్థాయి సభ్య దేశాలు (ఫుల్ మెంబర్స్) క్వాలిఫైయర్‌లో పోటీపడే 10 జట్లు ఉంటాయి. సీడబ్ల్యూసీ లీగ్-2 (CWC League 2) నుంచి టాప్-4 జట్లు అర్హత సాధిస్తాయి.
మిగతా నాలుగు స్థానాల కోసం 'ప్రపంచకప్ క్వాలిఫైయర్ ప్లేఆఫ్' నిర్వహిస్తారు. సీడబ్ల్యూసీ లీగ్-2లో చివరి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు, ఛాలెంజ్ లీగ్ నుంచి వచ్చే నాలుగు జట్లు ఈ ప్లేఆఫ్‌లో తలపడతాయి. వీటిలో టాప్-4గా నిలిచిన జట్లు ప్రధాన క్వాలిఫైయర్‌కు చేరుకుంటాయి. కాగా, 14 జట్లతో జరగనున్న ఈ వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే
ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ