Share News

విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారు: ఉదయనిధి స్టాలిన్

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:28 PM

తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తన అరెస్టుపై మరోసారి విమర్శలు చేశారు. తన అరెస్టు పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో జరిగిందని, ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఇలా చేశారని ఆరోపించారు.

విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారు: ఉదయనిధి స్టాలిన్
Vijay, Udhayanidhi Stalin

తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తన అరెస్టుపై మరోసారి విమర్శలు చేశారు. తన అరెస్టు పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో జరిగిందని, ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఇలా చేశారని ఆరోపించారు. అలాగే ముఖ్యమంత్రి విజయ్ ఈ అంశంపై ఇప్పటికీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు (Udhayanidhi Stalin about Vijay).


త్రిషపై వ్యాఖ్యల నేపథ్యంలో ఉధయనిధిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. మంగళవారం హైడ్రామా తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ బుధవారం అసెంబ్లీకి హాజరయ్యారు. 'రాష్ట్రంలో కావేరి జల వివాదం, మేకేదాటు ప్రాజెక్టు, రైతుల సమస్యలు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ సమయంలో నా అరెస్టు పెద్ద రాజకీయ అంశంగా మారింది. ప్రజల దృష్టిని మళ్లించడమే ఈ చర్య వెనుక ఉన్న ఉద్దేశం' అని ఉదయనిధి ఆరోపించారు (Trisha Controversy).


తన అరెస్టుపై ముఖ్యమంత్రి మౌనం వహించడాన్ని ఉదయనిధి ఎద్దేవా చేశారు (DMK vs TVK). అలాగే 'నేను ద్వంద్వార్థాలు వాడానని కొందరు ఆరోపించారు. నేను ఒకే అర్థంతో మాట్లాడాను. రైతులకు నీరు కావాలి. దాని గురించే నేను మాట్లాడాను. మహిళలను అగౌరవపరిచే ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు. తమిళనాడులోని ప్రతి తల్లిని, సోదరిని నేను నా సొంత కుటుంబంగా భావిస్తాను' అని ఉదయనిధి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సిందే.. యూపీఐ చార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..


షేక్ హసీనా ప్రసంగంతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదు: విదేశాంగ శాఖ

Updated Date - Aug 05 , 2026 | 05:30 PM