Share News

ఇరాన్ యుద్ధం.. భారీగా తరిగిపోతున్న అమెరికా క్షిపణి నిల్వలు..

ABN , Publish Date - Aug 05 , 2026 | 04:23 PM

ఇరాన్‌తో నెలలుగా కొనసాగుతున్న యుద్ధం అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇరాన్ యుద్ధం.. భారీగా తరిగిపోతున్న అమెరికా క్షిపణి నిల్వలు..
US Missile Stockpile

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో నెలలుగా కొనసాగుతున్న యుద్ధం అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా థాడ్ (THAAD), పేట్రియట్ (Patriot) వంటి అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థల కోసం ఉపయోగించే ఇంటర్‌సెప్టార్ క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గిపోయినట్లు తాజాగా 'సీఎన్‌ఎన్' వెల్లడించింది (US Missile Stockpile).


సీఎన్‌ఎన్ నివేదిక ప్రకారం, యుద్ధానికి ముందున్న నిల్వలతో పోలిస్తే అమెరికా సైన్యం థాడ్ ఇంటర్‌సెప్టార్‌లలో దాదాపు 80 శాతాన్ని, పేట్రియాట్ ఇంటర్‌సెప్టార్‌లలో సుమారు 50 శాతాన్ని వినియోగించేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికా సైన్యం పెద్ద ఎత్తున థాడ్, పేట్రియట్ ఇంటర్‌సెప్టర్లను వినియోగించింది. అమెరికా భవిష్యత్తులో మరో పెద్ద సైనిక ఘర్షణను ఎదుర్కోవాల్సి వస్తే క్షిపణి నిల్వల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఈ కథనం వెల్లడించింది (THAAD, Patriot Missile).


పేట్రియట్, థాడ్ వ్యవస్థలతో పాటు దీర్ఘ శ్రేణి ఖచ్చితత్వ క్షిపణులు, తొమహాక్ క్రూయిజ్ క్షిపణుల నిల్వలు కూడా భారీగా తరిగిపోయాయి (Missile Interceptors). గత వారం ఇరాన్‌పై తలపెట్టిన భారీ దాడిని వాయిదా వేయడానికి, క్షీణిస్తున్న రక్షణ ఆయుధ సామగ్రి కూడా ఒక కారణమని సీఎన్‌ఎన్ నివేదించింది. అయితే అమెరికా రక్షణ శాఖ మాత్రం తమ సైనిక సామర్థ్యానికి ఎలాంటి ముప్పూ లేదని, అవసరమైన ఆయుధాల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నామని తెలిపింది.


ఇవి కూడా చదవండి..

ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సిందే.. యూపీఐ చార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..


షేక్ హసీనా ప్రసంగంతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదు: విదేశాంగ శాఖ

Updated Date - Aug 05 , 2026 | 04:23 PM