సౌతాఫ్రికా టీ20 లీగ్: కీరన్ పొలార్డ్‌ను పక్కన పెట్టిన ఎంఐ
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:10 PM
దక్షిణాఫ్రికా వేదికగా అత్యంత వైభవంగా జరిగే 'ఎస్‌ఏ20' (SA20) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. టోర్నమెంట్‌లో భాగంగా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్లు, ప్రీ-అక్షన్ సైనింగ్స్ ప్రక్రియను పూర్తి చేశాయి.
స్పోర్ట్స్ డెస్క్: దక్షిణాఫ్రికా వేదికగా అత్యంత వైభవంగా జరిగే 'ఎస్‌ఏ20' (SA20) లీగ్ ఐదో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. టోర్నమెంట్‌లో భాగంగా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్లు, ప్రీ-అక్షన్ సైనింగ్స్ ప్రక్రియను పూర్తి చేశాయి. ఐదో సీజన్ ప్రారంభానికి ముందే ఫ్రాంఛైజీలు తమ జట్టులో పలు మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఎంఐ కేప్ టౌన్ యాజమాన్యం వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు కీరన్ పొలార్డ్‌ను విడుదల చేసింది. అలానే జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫాప్ డుప్లెసిస్‌ను రిలీజ్ చేసింది.ఈ సీజన్లో మిచెల్ మార్ష్, సామ్ కరన్, జో రూట్, ఫిల్ సాల్ట్, జాసన్ హోల్డర్ వంటి విదేశీ ఆటగాళ్లు ఈసారి లీగ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
మరోవైపు 'డర్బన్స్ సూపర్ జెయింట్స్', 'పార్ల్ రాయల్స్' (Paarl Royals) జట్లు తమ 19 మంది సభ్యుల పూర్తి జట్లను ఇప్పటికే రిటెన్షన్లు, ప్రీ-ఆక్షన్ సైనింగ్స్ ద్వారా ఖరారు చేశాయి. మిగిలిన ఫ్రాంఛైజీల వద్ద మరో 19 ఖాళీ స్థానాలు మిగిలి ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ 'సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్' తమ జట్టును మరింత పటిష్ఠం చేసుకునే క్రమంలో ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్‌ను తొలిసారిగా తమ జట్టులోకి సొంతం చేసుకుంది.
డర్బన్ సూపర్ జెయింట్స్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను దక్కించుకుంది. పార్ల్ రాయల్స్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్‌ను వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా, అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను తమ జట్టులోకి ఆహ్వానించాయి. 'ప్రెటోరియా క్యాపిటల్స్' ఇంగ్లండ్ వికెట్ కీపర్-బ్యాటర్ ఫిల్ సాల్ట్, ఆస్ట్రేలియా ప్లేయర్ మాథ్యూ షార్ట్‌లను దక్కించుకుని తమ బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత బలోపేతం చేసుకున్నాయి.
మరోవైపు, ప్రముఖ మార్పుల్లో భాగంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ప్రెటోరియా క్యాపిటల్స్ నుంచి 'ఎండీ కేప్ టౌన్' జట్టుకు మారాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యంలోని జట్టులో జాక్స్‌కి ఇది మూడో సీజన్ కానుంది. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందే ఆటగాళ్ల మార్పిడితో క్రికెట్ అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరాయి.
ఇవి కూడా చదవండి:
అగార్కర్‌పై వేటు?.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ రేసులోకి వీవీఎస్ లక్ష్మణ్!
చివరి బంతికి ఒక్క పరుగు.. ఈ మిస్‌ఫీల్డ్ క్రేజీ రనౌట్‌ను చూడాల్సిందే!