దేశంలో ఎక్కడా బీసీల కోసం ప్రత్యేక చట్టం లేదు: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Aug 05 , 2026 | 02:46 PM
బీసీల కోసం ప్రత్యేక చట్టమంటూ దేశంలో ఎక్కడా లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బీసీల కోసం కొత్తగా తెచ్చే చట్టంపై రెండేళ్ల నుంచి తీవ్ర కసరత్తు చేశామని తెలిపారు.
అమరావతి, ఆగస్టు 5: బీసీల కోసం ప్రత్యేక చట్టమంటూ దేశంలో ఎక్కడా లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈరోజు(బుధవారం) బీసీ రక్షణ చట్టంలోని వివరాలను మీడియాకు మంత్రి వెల్లడించారు. బీసీల కోసం కొత్తగా తెచ్చే చట్టంపై రెండేళ్ల నుంచి తీవ్ర కసరత్తు చేశామని తెలిపారు. 2019-24 కాలంలో బలహీనవర్గాలపై కక్షకట్టి దమనకాండ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనవర్గాల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో పెట్టామని అన్నారు. సమస్యల పరిష్కారానికి సబ్‌కమిటీ కూడా నియమించామన్నారు. సమాజంలో బలహీనవర్గాలకు ఉన్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది అన్న ఎన్టీఆర్ అని.. ఆ రిజర్వేషన్లను 27 శాతానికి పెంచింది చంద్రబాబు నాయుడు అని మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బలహీనవర్గాలు 70 శాతం మంది ఉన్నారని తెలిపారు. శాసనసభ్యుల అభిప్రాయాలే కాకుండా అందరి ఆమోదం కావాలన్నారు. శాసనసభలో డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించే ముందు కేంద్ర జాతీయ బీసీ కమిషన్ సలహాలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. ఈ చట్టాన్ని అన్ని విధాల అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. జిల్లాల వారీగా బలహీనవర్గాల సంఘాలతో మాట్లాడాలని సబ్ కమిటీకి చెప్పామని తెలిపారు. కొత్త చట్టాన్ని ప్రజలకు వివరించి సలహాలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు. టీడీపీ వెన్నంటే ఉంది బలహీనవర్గాలే అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
‘ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు’.. ప్రకాశ్ రాజ్‌పై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్
ప్రకాశం జిల్లా అభివృద్ధికి REMZ ప్రాజెక్ట్ కీలకం: గొట్టిపాటి రవికుమార్
Read Latest AP News And Telugu News