ప్రకాశం జిల్లా అభివృద్ధికి REMZ ప్రాజెక్ట్ కీలకం: గొట్టిపాటి రవికుమార్
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:45 PM
ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతంలో రెన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(REMZ) ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు పారదర్శకంగా రూ.31.57 కోట్ల పరిహారం అందించామని చెప్పారు.
ప్రకాశం, ఆగస్టు 5: జిల్లాలోని అద్దంకి ప్రాంతంలో రెన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(REMZ) ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. భూములు ఇచ్చిన రైతులకు పారదర్శకంగా రూ.31.57 కోట్ల పరిహారం అందించామని చెప్పారు. సోలార్ విద్యుత్ తయారీ కేంద్రం రాష్ట్రంలోనే కీలక పారిశ్రామిక ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులు, కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పారిశ్రామికాభివృద్ధితో పాటు రైతుల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం సమానంగా కాపాడుతోందన్నారు. ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో ఏపీ భవిష్యత్తు, ఆత్మగౌరం కనిపిస్తోంది: అనిత
‘ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు’.. ప్రకాశ్ రాజ్‌పై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్
Read Latest AP News And Telugu News