అమరావతిలో ఏపీ భవిష్యత్తు, ఆత్మగౌరం కనిపిస్తోంది: అనిత
ABN , Publish Date - Aug 05 , 2026 | 10:45 AM
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆత్మగౌరవం అమరావతిలో కనిపిస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి మోసం చేశారని విమర్శించారు.
అమరావతి, ఆగస్టు 5: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆత్మగౌరవం అమరావతిలో కనిపిస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. ఈరోజు(బుధవారం) అమరావతికి విచ్చేసిన హోంమంత్రి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. అక్కడి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి మోసం చేశారని విమర్శించారు. 2019-24 మధ్య 3 రాజధానుల పేరుతో కాలయాపన చేశారని మండిపడ్డారు. అమరావతి ఎలా ఉందో అని చూడడానికి వచ్చామని తెలిపారు. ఈ భవనాలను ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు.. ప్రజలు కూడా చూడాలన్నారు. మావిగాన్ గురించి మాట్లాడుతున్న నేతలు.. అమరావతికి వచ్చి చూడాలని తెలిపారు. అమరావతిలో భవన నిర్మాణాలను దగ్గరుండి చేయిస్తున్న మంత్రి నారాయణకు హోంమంత్రి అనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
వాక్ టూ వర్క్ కాన్సెప్ట్‌తో భవనాల నిర్మాణం: మంత్రి కొండపల్లి

అమరావతిలో భవనాలను చూసి చాలా ఆనందం కలుగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమరావతి కోసం రైతులు భూములు ఇచ్చారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో కార్యాలయాలు, నివాసాలను నిర్మించేలా చేశారన్నారు. వాక్ టూ వర్క్ కాన్సెప్ట్‌తో ఇక్కడ భవనాలు నిర్మాణం అవుతున్నాయని చెప్పారు. సెక్రటేరియట్, హెచ్‌ఓడీ బిల్డింగ్‌లను చాలా బాగా నిర్మిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు.
ఇవి కూడా చదవండి...
ఆదోనిలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు
Read Latest AP News And Telugu News