Home » Russia
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు తీసుకొచ్చిన బిల్లులో అమెరికా మార్పులు చేర్పులు చేసింది.
రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో అమెరికాలో రూపొందించిన ఆంక్షల బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించారు.
రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన డ్రోన్లు మాస్కో వైపు దూసుకొస్తుండగా, రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ తన దీర్ఘశ్రేణి డ్రోన్లతో రష్యా భూభాగంలో విధ్వంసానికి దిగింది.
భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'బ్రహ్మోస్' సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను తమ సొంత సాయుధ దళాలలో చేర్చుకోవడానికి రష్యా అమితాసక్తి కనబరుస్తోంది. అంతేకాదు, ఈ బ్రహ్మోస్ క్షిపణులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా మారాయి.
రష్యా రాజధాని మాస్కో మరోసారి ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో దద్దరిల్లింది. ఉక్రెయిన్ నిర్వహించిన భారీ డ్రోన్ దాడిలో మాస్కోలోని కీలక చమురు శుద్ధి కేంద్రం దెబ్బతింది.
సోచి (రష్యా) నుంచి బుధవారం టేకాఫ్ అయ్యాక కనిపించకుండా పోయిన ఒక విమానం ఆ తరువాత సేఫ్‌గా ల్యాండైంది. దీంతో, రష్యా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
ఇంగ్లిష్ ఛానెల్‌లో రష్యా యుద్ధ నౌక వ్యవహరించిన తీరుపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యాకు చెందిన Tu-22M3 యుద్ధ విమానం కుప్పకూలింది. సోమవారం ఫ్లైట్ ట్రైనింగ్ సందర్భంగా సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విమాన ప్రమాదాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.
రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు మే నెలలో గణనీయంగా పెరిగాయి. మే నెలలో రష్యా నుంచి మొత్తంగా 5.8 బిలియన్ యూరోల విలువైన చమురు, బొగ్గును భారత్ కొనుగోలు చేసినట్టు ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చి ఎనర్జీ అండ్ క్లీన్ నివేదిక వెల్లడించింది.