Share News

ఉక్రెయిన్‌తో యుద్ధం విరమించాలని రష్యాకు మోదీ పిలుపు

ABN , Publish Date - Aug 31 , 2026 | 08:37 PM

కిర్గిజిస్తాన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని తక్షణమే నిలిపివేసి శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని పుతిన్‌కు ఈ సందర్భంగా మోదీ విజ్ఞప్తి చేశారు.

ఉక్రెయిన్‌తో యుద్ధం విరమించాలని రష్యాకు మోదీ పిలుపు
PM Modi Tells Putin: Time to Move from Endless War to Peace

బిష్కెక్(కిర్గిజ్‌స్థాన్), ఆగస్టు 31: కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఉక్రెయిన్ ఘర్షణపై భారత్ వైఖరిని స్పష్టం చేసిన మోదీ, యుద్ధాన్ని తక్షణమే నిలిపివేసి శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు.


'యుద్ధంలో గడిచే ప్రతి రోజు మానవాళిని వెనక్కి నెడుతుంది. అదే శాంతి వైపు వేసే ప్రతి అడుగు కొత్త ఆశలను, ఉత్సాహాన్ని నింపుతుంది. మనం అంతం లేని యుద్ధం నుంచి బయటపడి, యుద్ధానికి అంతం పలకాలి. ఇది మానవాళి శ్రేయస్సుకు అత్యంత ఆవశ్యకం'. అని మోదీ ఈ సందర్బంగా రష్యాకు పిలుపునిచ్చారు.


మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడు నడయాడిన నేల అందించిన శాంతి సందేశాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి...

వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్‌-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానంటూ నమ్మించి మోసం.. జగన్‌పై ఎంపీ మాగుంట సీరియస్

Updated Date - Aug 31 , 2026 | 09:50 PM