వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానంటూ నమ్మించి మోసం.. జగన్‌పై ఎంపీ మాగుంట సీరియస్
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:42 PM
వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశానంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి మోసం చేశారంటూ ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేదికపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్‌పై ఎంపీ విరుచుకుపడ్డారు.
మార్కాపురం, ఆగస్టు 31: వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశానంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి మోసం చేశారంటూ ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేదికపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్‌పై ఎంపీ విరుచుకుపడ్డారు. జగన్ ఓ మూర్ఖుడంటూ వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరిగిన తీరు చూస్తుంటే భావోద్వేగంతో కళ్ల వెంబడి నీళ్లు తిరుగుతున్నాయన్నారు. మార్కాపురం ప్రజలు, రైతులకు మేలు చేసేలా వెలిగొండ ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు పూర్తి చేశారని తెలిపారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం సాయం అందించిందని చెప్పారు. కులపోడని 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకున్నామని.. వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశానంటూ ఇక్కడి ప్రజలను మోసం చేశారంటూ విరుచుకుపడ్డారు. మార్కాపురం జిల్లా ప్రజలకు ఇంత మేలు చేసిన చంద్రబాబుకు అండగా నిలుద్దామని ఎంపీ మాగుంట శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఐదు బైక్‌ల దగ్ధం
వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News