రూ.50 వేల కోట్లతో భారత్ వైమానిక రక్షణ కవచం!
ABN , Publish Date - Aug 30 , 2026 | 09:20 PM
భారత వైమానిక దళం కోసం మరో ఐదు S-400 'సుదర్శన్' యూనిట్ల కొనుగోలుకు సంబంధించి భారత్ జారీ చేసిన టెండర్‌కు రష్యా తన ప్రతిపాదనను సమర్పించింది. ఈ కొత్త ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.50,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
ఢిల్లీ, ఆగస్టు 30: భారత వైమానిక దళ (IAF) రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదూర శ్రేణి 'S-400 సుదర్శన్' ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌కు సంబంధించి మరో 5 కొత్త స్క్వాడ్రన్ల కొనుగోలుకు భారత్ జారీ చేసిన టెండర్‌కు రష్యా అధికారికంగా తన సమగ్ర ప్రతిపాదనను సమర్పించింది.
రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. రష్యా అందించిన ఈ ప్రతిపాదనను భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం పరిశీలిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.50,000 కోట్లకు పైగానే ఉంటుందని రక్షణ వర్గాలు వెల్లడించాయి.
నవంబర్ నాటికి మొదటి కాంట్రాక్ట్ పూర్తి
2018లో భారత్-రష్యాల మధ్య జరిగిన తొలి ఒప్పందంలో భాగంగా మొత్తం 5 స్క్వాడ్రన్లకు గాను ఇప్పటికే 4 స్క్వాడ్రన్లు భారత్‌కు చేరాయి. ఐదో (చివరి) స్క్వాడ్రన్ ఈ ఏడాది నవంబర్ నాటికి అందుబాటులోకి రానుంది. కాగా, ప్రస్తుతం చర్చల్లో ఉన్న కొత్త ఒప్పందంపై సంతకాలు పూర్తయిన మూడేళ్ల తర్వాత ఈ కొత్త క్షిపణి వ్యవస్థల సరఫరా ప్రారంభమయ్యే అవకాశముంది.
ఈ ఏడాది ఆరంభంలో చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' ముగిసిన వెంటనే, తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో వైమానిక రక్షణను మరింత పటిష్టం చేసేందుకు మరో 5 S-400 స్క్వాడ్రన్లను సేకరించే ప్రణాళికలకు భారత్ ఆమోదం తెలిపింది.
'ఆపరేషన్ సింధూర్'లో గేమ్ ఛేంజర్
పాకిస్తాన్‌తో జరిగిన 'ఆపరేషన్ సింధూర్' సమయంలో S-400 సుదర్శన్ వ్యవస్థ భారత విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన అనేక నిఘా విమానాలు, ఫైటర్ జెట్లను ఇది ధ్వంసం చేయడమే కాకుండా.. భారత సరిహద్దుకు 200 కిలోమీటర్ల పరిధిలోకి పాక్ విమానాలు రాకుండా నిరోధించగలిగింది.
భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని