Share News

దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలి.. ‘మన్ కీ బాత్‌’లో ప్రధాని

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:38 PM

వికసిత్ భారత్ లక్ష్యం సాకారమయ్యేందుకు దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం 137వ ఎపిసోడ్‌లో నేడు ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలి.. ‘మన్ కీ బాత్‌’లో ప్రధాని
PM Modi Mann Ki Baat

ఇంటర్నెట్ డెస్క్: వికసిత్ భారత్ లక్ష్యం సాకారమయ్యేందుకు దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం 137వ ఎపిసోడ్‌లో నేడు ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత దేశ భవితను కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇటీవల ప్రారంభమైన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం’ విజయవంతంగా సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. భారీ సంఖ్యలో యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటోందని చెప్పారు.

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కంటెంట్ క్రియేటర్లు తమ తమ భాషల్లో ప్రచారం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ వ్యసనం కుటుంబాలను, సమాజాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు యువత ఎందుకు దూరంగా ఉండాలో విశదీకరించాలని కంటెంట్ క్రియేటర్లకు సూచించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిని, ఈ వ్యసనానికి బానిసలైన వారికి సాయం చేసే వారిని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు.


వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తైన సందర్భంలో ఈ సంవత్సరం భారతీయులందరికీ ఎంతో ప్రత్యేకమైనదని కూడా ప్రధాని చెప్పారు. సూర్యపథ్ తిరంగా కార్యక్రమం ద్వారా ఈ ఏడాది మువ్వన్నెల జెండా యావత్ ప్రపంచాన్ని చుట్టొచ్చిందని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన పీఎం స్వనిధి యోజన గురించి ప్రధాని మాట్లాడారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించగలిగారని అన్నారు. పరిశరాల పరిశుభ్రతపై నిరంతరం దృష్టి పెట్టాలని కూడా పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులకు భారతీయులు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

‘ఆప్’ నేత దారుణ హత్య.. బైక్‌ను వెంబడించి మరీ..

Updated Date - Aug 30 , 2026 | 02:05 PM