Share News

‘ఆప్’ నేత దారుణ హత్య.. బైక్‌ను వెంబడించి మరీ..

ABN , Publish Date - Aug 30 , 2026 | 09:24 AM

పంజాబ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత హత్యకు గురయ్యారు. రాజకీయ ప్రత్యర్థులు ఆయనను తుపాకితో కాల్చి చంపారు. శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

‘ఆప్’ నేత దారుణ హత్య.. బైక్‌ను వెంబడించి మరీ..
Gurpreet Singh Gopi

ఇంటర్‌నెట్ డెస్క్: పంజాబ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత హత్యకు గురయ్యారు. రాజకీయ ప్రత్యర్థులు ఆయనను తుపాకితో కాల్చి చంపారు. శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత గుర్‌ప్రీత్ గోపి శనివారం తన మిత్రుడు హర్‌ప్రీత్‌తో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తున్నారు. మరి కొంతమంది స్నేహితులు కారులో బైకును ఫాలో అవ్వసాగారు.


కొంతదూరం పోయిన తర్వాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కారులో వచ్చిన దుండగులు బైకుపై వెళుతున్న వారిని వెంబడించారు. గుర్‌ప్రీత్, హర్‌ప్రీత్‌లపై తుపాకులతో కాల్పులు జరిపారు. గుర్‌ప్రీత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైకు వెనుక కారులో వస్తున్న గుర్‌ప్రీత్ స్నేహితులపై కూడా దుండగులు కాల్పులు జరిపారు. మమ్‌దోత్ టౌన్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


రాజకీయ కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడికి నేరచరిత్ర ఉందని, అతనడు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి అని ఎస్ఎస్‌పీ భూపీందర్ సింగ్ తెలిపారు. నిందితులను ఇప్పటికే గుర్తించామని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

చీరలతో ముగ్గు...నగలతో పెయింటింగ్‌...

ఆసియా కప్: పాకిస్థాన్‌తో హ్యాండ్ షేక్ వివాదం.. కోచ్ అమోల్ ఏమన్నారంటే?

Updated Date - Aug 30 , 2026 | 09:39 AM