మోదీ-పుతిన్.. బిష్కెక్‌లో మరోసారి ఒకే కారులో ప్రయాణం..
ABN , Publish Date - Aug 31 , 2026 | 09:40 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి తమ ప్రత్యేక స్నేహాన్ని చాటుకున్నారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక భేటీ అనంతరం ఇద్దరు నేతలు ఒకే కారులో కలిసి ప్రయాణించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి తమ ప్రత్యేక స్నేహాన్ని చాటుకున్నారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక భేటీ అనంతరం ఇద్దరు నేతలు ఒకే కారులో కలిసి ప్రయాణించారు. బిష్కెక్ అరేనాలో జరిగిన 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి వారు కలిసి వెళ్లారు (PM Modi Putin meeting).
పుతిన్, ప్రధాని మోదీ ఒకే కారులో కలిసి ప్రయాణించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది చైనాలోని టియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా కూడా మోదీ, పుతిన్ ఒకే కారులో ప్రయాణించారు. 2025 డిసెంబర్‌లో పుతిన్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణించారు. దీంతో మోదీ-పుతిన్ మధ్య ఈ అనధికారిక ప్రయాణాలను 'కార్ డిప్లొమసీ'గా పిలుస్తున్నారు (Car diplomacy).
కారు ప్రయాణానికి ముందు బిష్కెక్‌లో మోదీ, పుతిన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారత్-రష్యా ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ చర్చించారు. ఇంధనం, ఆవిష్కరణలు, అంతరిక్షం, ఎరువులు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో పురోగతి సాధిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'అంతులేని యుద్ధం నుంచి ముగింపు దిశగా వెళ్లాలి' అని పుతిన్‌తో అన్నారు (India Russia relations).
కాగా, భారత్-రష్యా సంబంధాల విషయంలో మోదీ చూపుతున్న వ్యక్తిగత శ్రద్ధను పుతిన్ ప్రశంసించారు (Modi Putin car ride). రెండు దేశాల మధ్య సంబంధాలను కొనసాగించడంలో మోదీ పాత్రను అభినందిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మోదీ కూడా సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్‌ను అధికారికంగా ఆహ్వానించారు. పుతిన్ భారత్ పర్యటన రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు.
ఇవి కూడా చదవండి..
2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..