Share News

భారత్ తన అవసరాల కోసమే.. మా చమురు కొంటోంది: రష్యా

ABN , Publish Date - Sep 06 , 2026 | 09:58 PM

రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం కేవలం తన సొంత దేశ ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలు మాత్రమేనని, రష్యాకు ఆర్థికంగా సహాయం చేయడం కాదని భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు.

భారత్ తన అవసరాల కోసమే.. మా చమురు కొంటోంది: రష్యా
India Buys Russian Oil for Energy Security, Not to Help Russia: Denis Alipov

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 6: రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం కేవలం తన సొంత దేశ ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలు మాత్రమేనని, రష్యాకు ఆర్థికంగా సహాయం చేయడం కాదని భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ (Denis Alipov) అన్నారు. పాశ్చాత్య దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అదనపు టారిఫ్‌లు, తీవ్రమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


భారత్ తన 140 కోట్ల జనాభా ఇంధన అవసరాలు, దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే రష్యా చమురును కొనుగోలు చేస్తోంది తప్ప ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా కాదని అలిపోవ్ పేర్కొన్నారు.

నాణ్యమైన లేదా తక్కువ ధరకే చమురు అందించే మెరుగైన ప్రత్యామ్నాయ ఒప్పందాలను భారత్‌కు అందించలేక, అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆంక్షల పేరుతో ఒత్తిడి తంత్రాలు ఉపయోగిస్తున్నాయని విమర్శించారు.

భారతదేశానికి ఎంత పరిమాణంలో చమురు అవసరమైతే అంత సరఫరా చేయడానికి రష్యా సిద్ధంగా ఉందన్నారు. భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోగలదని రష్యా విశ్వసిస్తోందని ఆయన తేల్చి చెప్పారు.


ఇవీ చదవండి:

‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’.. 14 గంటలు ప్రయాణించిన తండ్రి.!

మంచుకొండపై మానవ వేడి.. 154 టన్నులు కరిగిన మంచు.!

Updated Date - Sep 06 , 2026 | 10:00 PM