Home » Rohit Sharma
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే ఈ రోజు (శనివారం) జరగబోతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది. ఇక, క్లీన్ స్వీప్ అవమానం నుంచి తప్పించుకోవడం ఒకటే ఇప్పుడు టీమిండియా ముందున్న లక్ష్యం.
రోహిత్ శర్మ సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా టూర్ లో మూడు వన్డేల సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్ లో క్రికెట్ ఫ్యాన్స్ ను నిరాశపర్చిన హిట్ మ్యాన్.. రెండో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) రాణించడంతో ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కాస్త మెరుగైన స్థితిలో నిలిచింది. అక్షర్ పటేల్ (44) కూడా కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకోవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.
ఆడిలైడ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన క్లాస్ వెలికి తీశాడు. జట్టుకు అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తను అనుభవంతో ఆదుకున్నాడు.
రోహిత్ శర్మ భవిత్యంపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. తాజాగా జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మ ఒకింత డల్‌గా కనిపించాడని, అతడిని తప్పించే అవకాశం ఉందన్న వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాల్గొంటున్నారు. అయితే పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు.
టీమిండియా యంగ్ ప్లేయర్, హైదరాబాద్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాపై జరిగిన తొలి వన్డే మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ ను నితీష్ అందుకున్నాడు.
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు. ఇప్పటికే టీ-20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగబోతున్నాడు.
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు. ఇప్పటికే టీ-20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగబోతున్నాడు.
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.