కోహ్లీ-రోహిత్ పైనే ఆధారపడ్డ టీమిండియా

ABN, Publish Date - Dec 06 , 2025 | 02:48 PM

విశాఖ వేదికగా భారత్, సౌతాఫ్రికా చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇది ఇలా ఉంటే.. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ ప్లేయర్లు అయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఆధారపడినట్లు కనిపిస్తుంది. గత రెండు మ్యాచుల్లో చూసుకుంటే విరాట్ సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. మిగిలిన ప్లేయర్లు ఎవరూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

ఇంటర్నెట్ డెస్క్: విశాఖ వేదికగా భారత్, సౌతాఫ్రికా చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇది ఇలా ఉంటే.. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ ప్లేయర్లు అయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఆధారపడినట్లు కనిపిస్తుంది. గత రెండు మ్యాచుల్లో చూసుకుంటే విరాట్ సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. మిగిలిన ప్లేయర్లు ఎవరూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ మ్యా్చ్ లో కూడా భారత జట్టు రో-కో లపైనే ఆధారపడింది. కోహ్లీకి ఈ స్టేడియం బాగా కలిసొచ్చింది. విశాఖలో ఆడిన 7 వన్డేల్లో 97.83 సగటుతో 587 పరుగులు చేశాడు. అదే విధంగా ఈ వేదికపై కోహ్లీ మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు చేశాడు. 1986-87లో టెస్టు వన్డే సిరీస్ ను భారత్ కోల్పోయింది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ లో కూడా 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఆఖరి పోరులో ఎవరిది పై చేయి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Seema Punia: సీమా పునియాకు భారీ షాక్.. 16 నెలల నిషేధం

Steve Smith: స్టీవ్ స్మిత్ రికార్డ్.. ఆసీస్ తరఫున తొలి ప్లేయర్‌గా

Updated at - Dec 06 , 2025 | 02:48 PM