Seema Punia: సీమా పునియాకు భారీ షాక్.. 16 నెలల నిషేధం
ABN , Publish Date - Dec 06 , 2025 | 10:31 AM
ఆసియా క్రీడల బంగారు పతకం విజేత, స్టార్ డిస్కస్ త్రో అథ్లెట్ సీమా పునియా(Seema Punia)కు బిగ్ షాక్ తగిలింది. డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో ఆమెపై 16 నెలల నిషేధం విధిస్తూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిర్ణయం తీసుకుంది. 42 ఏళ్ల పునియాపై సస్పెన్షన్ నవంబర్ 10 నుంచే అమల్లోకి వచ్చినట్లు తాజాగా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా గేమ్స్ గోల్డ్ మెడల్ విన్నర్, స్టార్ డిస్కస్ త్రో అథ్లెట్ సీమా పునియా(Seema Punia)కు బిగ్ షాక్ తగిలింది. డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో ఆమెపై 16 నెలల నిషేధం విధిస్తూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిర్ణయం తీసుకుంది. 42 ఏళ్ల పునియాపై సస్పెన్షన్ నవంబర్ 10 నుంచే అమల్లోకి వచ్చినట్లు తాజాగా వెల్లడించింది. అయితే, పునియా ఏ ఉత్ప్రేరకం వాడిందో మాత్రం నాడా తెలపలేదు. ఆమె కెరీర్‌లో నిషేధం ఎదుర్కోవడం ఇది రెండోసారి. గతంలో జూనియర్ స్థాయిలో డోపింగ్ టెస్టులో విఫలమై నిషేధం ఎదుర్కొంది. పునియా చివరిసారిగా 2023లో జరిగిన హాంగ్‌జౌ ఆసియా క్రీడలు పాల్గొన్నారు. అక్కడ ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె నాలుగుసార్లు కామన్వెల్త్ క్రీడలలో పతక విజేతగా నిలిచింది. వాటిలో మూడు రజత పతకాలు గెలిచింది. ఇప్పుడీ నిషేధంతో ఆమె( Indian athletics) కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లేనని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సీమా పునియా తొలిసారి ఆసియా క్రీడల 2014 ఇంచియాన్ ఎడిషన్‌లో పాల్గొంది. ఆమె జూనియర్ స్థాయిలో 2002లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో కాంస్యం గెలుచుకుంది. ఆమెతో పాటు, మరో అథ్లెట్ పూజా యాదవ్ (నాలుగు ఏళ్లు), షాట్ పుటర్ మంజీత్ కుమార్ (ఆరు ఏళ్లు), మిడిల్-డిస్టెన్స్ రన్నర్ నికేష్ ధన్‌రాజ్ రాథోడ్ (నాలుగు ఏళ్లు) కూడా డోప్ పరీక్ష(doping controversy)ల్లో విఫలమైనందుకు సస్పెండ్ చేయబడ్డారు. మారథాన్ రన్నర్ కుల్దీప్ సింగ్, మహిళా స్టీపుల్ చేజర్ చావి యాదవ్‌లను కూడా 4 ఏళ్లు సస్పెన్షన్ కు గురయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కెప్టెన్సీ నిర్ణయం పూర్తిగా ఫ్రాంచైజీదే: రియాన్ పరాగ్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. షఫాలీ వర్మ నామినేట్