Junior Hockey World Cup Semis: సెమీస్‌కు భారత్
ABN , Publish Date - Dec 06 , 2025 | 03:55 AM
పూల్ మ్యాచ్‌ల్లో చిన్నజట్లపై విజయాలు సాధించిన భారత్..క్వార్టర్‌ఫైనల్ కఠిన పరీక్షలో నెగ్గింది. అత్యంత బలమైన బెల్జియం జట్టును..పెనాల్టీ షూటౌట్‌లో.....
‘షూటౌట్’లో బెల్జియం చిత్తు
జూనియర్ హాకీ ప్రపంచ కప్
చెన్నై: పూల్ మ్యాచ్‌ల్లో చిన్నజట్లపై విజయాలు సాధించిన భారత్..క్వార్టర్‌ఫైనల్ కఠిన పరీక్షలో నెగ్గింది. అత్యంత బలమైన బెల్జియం జట్టును..పెనాల్టీ షూటౌట్‌లో కంగుతినిపించింది. దాంతో జూనియర్ పురుషుల వరల్డ్ కప్ హాకీ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన పోరులో యువ భారత్ షూటౌట్‌లో 4-3తో బెల్జియం జట్టును చిత్తు చేసింది. నిర్ణీత సమయానికి మ్యాచ్ 2-2తో సమమైంది. భారత్ తరపున రోహిత్ (45 ని.), శారదానంద తివారీ (48 ని.) గోల్స్ చేశారు. కోరెంజ్ (13 ని.), నాథన్ (59 ని.) బెల్జియానికి గోల్స్ అందించారు. ఆదివారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మరో క్వార్టర్‌ఫైనల్లో జర్మనీ పెనాల్టీ షూటౌట్‌లో 3-1తో ఫ్రాన్స్‌పై నెగ్గింది. ఇతర క్వార్టర్‌ఫైనల్స్‌లో స్పెయిన్ 4-3తో న్యూజిలాండ్‌ని, అర్జెంటీనా 1-0తో నెదర్లాండ్స్‌ని ఓడించాయి. రెండో సెమీఫైనల్లో అర్జెంటీనా-స్పెయిన్ ఢీకొంటాయి.