Final ODI Match: వన్డే వార్.. నేడే భారత్, సౌతాఫ్రికా మ్యాచ్
ABN , Publish Date - Dec 06 , 2025 | 08:12 AM
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం జరగనున్న అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు విశాఖ స్టేడియం సర్వం సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్ కీలకంగా మారింది.
విశాఖపట్నం, డిసెంబరు 5: పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం జరగనున్న అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్ కీలకంగా మారింది. గెలుపు కోసం ఇరుజట్ల సారథులు వ్యూహ ప్రతి వ్యూహాలతో సన్నద్ధ మవుతున్నారు.
అందరి దృష్టి విరాట్, రోహిత్‌లపైనే..
క్రీడాభిమానుల దృష్టి అంతా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల పైనే ఉంది. వరుసగా రెండు మ్యాచ్లలో సెంచరీలతో చెలరేగిన కోహ్లి... ఈ మ్యాచ్లో కూడా సెంచరీ సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటివరకూ ఇక్కడ జరిగిన వన్డేల్లో కోహ్లి మూడు సెంచరీలు చేశాడు. ఇక ఇక్కడి పిచ్పి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. దీంతో అతను కూడా రాణించే అవకాశాలు ఉన్నాయని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా విరాట్, రోహిత్‌లకు విశాఖలో ఇదే చివరి మ్యాచ్‌కు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
నో సీటు నంబర్ విధానం:
ఈ మ్యాచ్‌కు సీటు నంబరింగ్ విధానం అమలు చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ మాదిరిగా ముందు వచ్చినవారు తమకు ఇష్టమైన సీట్లలో కూర్చునే విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో ప్రేక్షకులలో ఆందోళన నెలకొంది. మ్యాచ్‌కు కనీసం రెండు గంటల ముందుగా స్టేడియంలోకి వెళ్లకపోతే ముందు సీట్ల లభించవని భావిస్తున్నారు. ఈ విధానంతో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. కాగా ఇరుజట్లు శుక్రవారం స్టేడియంలో సాధన చేశాయి. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాధన చేయగా, భారత్ ఆటగాళ్లు సాయంత్రం నెట్ ప్రాక్టీస్ చేశారు. కాగా మ్యాచ్ శనివారం మద్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.
స్టేడియంలోకి ఇవి నిషేధం..
ప్రేక్షకులు కెమెరాలు, అగ్గిపెట్టెలు, లైటర్లు, సిగరెట్లు, వాటర్ బాటిళ్లు, మండే స్వభావం గల వస్తువులు, కుర్చీలు, స్టూలు, పొగాకు ఉత్పత్తులు, టిఫిన్లు, పదునైనా వస్తువులు, తినుబండారాలు, గౌడు గులు, క్రేకర్స్, బ్యాక్ ప్యాక్స్, జంతువులు, రేడియో, ఆల్కహాల్, కర్రలు, మ్యూజికల్స్, లేజర్ లైట్లు, బెలూన్లు, గ్లాస్ బాటిళ్లు, స్ప్రే బాటిళ్లు, సిరంజి లు, విజిల్స్, హారన్స్, స్పోర్టింగ్ బాల్స్, రోలర్ స్కేటర్లు, ప్రమోషనల్ ప్రొడక్ట్స్, ల్యాప్ ట్యాప్స్, పెన్నులు, పెన్సిళ్లు తీసుకువెళ్లకూడదు.
మ్యాచ్‌కు భారీ భద్రత:
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ కు సుమారు రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్‌తో పిచ్, ఔట్ ఫీల్డుతో పాటు గ్యాలరీలు, పరిసరాలు శుక్రవారం తనిఖీ చేశా రు. అన్ని గేట్ల వద్ద క్యూలో ప్రేక్షకులను లోపలికి పంపించేలా బారికేడ్లు సిద్ధం చేశారు. మ్యాచ్ సుమారు రాత్రి 11 గంటల సమయంలో ముగుస్తుందని వేల సంఖ్య లో వాహనాలు జాతీయ రహదారిపైకి రాకుండా చోదకులు సంయమనం పాటించి కొద్ది నిమిషాల వ్యవధిలో వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తవన్నారు.
తుది జట్లు (అంచనా)
భారత్: యశస్వీ జైస్వాల్, రోహిత్, కోహ్లీ, రుతురాజ్, రాహుల్ (కెప్టెన్), సుందర్/తిలక్, జడేజా, హర్షిత్, కుల్దీప్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్.
దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్, డికాక్, బవుమా (కెప్టెన్), బ్రీట్‌స్కే, రికెల్టన్, బ్రెవిస్, యాన్సెన్, బాష్, కేశవ్, ఎన్‌గిడి, బార్ట్‌మన్.
ఈ వార్తలు కూడా చదవండి..
కెప్టెన్సీ నిర్ణయం పూర్తిగా ఫ్రాంచైజీదే: రియాన్ పరాగ్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. షఫాలీ వర్మ నామినేట్