Smriti Mandhana: పెళ్లి వాయిదా తర్వాత.. మంధాన తొలి పోస్టు
ABN , Publish Date - Dec 06 , 2025 | 03:53 AM
బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో తన పెళ్లిని వాయిదా వేసుకున్న తర్వాత టీమిండియా క్రికెటర్ స్మృతీ మంధాన తొలిసారి సోషల్ మీడియాలో....
న్యూఢిల్లీ: బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో తన పెళ్లిని వాయిదా వేసుకున్న తర్వాత టీమిండియా క్రికెటర్ స్మృతీ మంధాన తొలిసారి సోషల్ మీడియాలో కనిపించింది. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించి తాను చేసిన ప్రమోషన్ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో శుక్రవారం పోస్ట్ చేసింది. కాగా, ఆ వీడియోలో ఆమె చేతివేలికి నిశ్చితార్ధపు ఉంగరం లేకపోవడంతో నెటిజన్లు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. పలా్‌షతో పెళ్లిని రద్దు చేసుకుందనేందుకు ఇదే నిదర్శనం అంటూ కొందరు పోస్ట్‌లు పెడితే.. ఆ వీడియోను మంధాన తన నిశ్చితార్ధానికి ముందు చేసి ఉండొచ్చుగా! అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా.. ఈ పెళ్లి త్వరలోనే జరుగుతుందని ఓవైపు పలాష్ కుటుంబం చెబుతుండగా, మంధాన తరఫు నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా రాకపోవడం గమనార్హం.