Shafali Verma: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. షఫాలీ వర్మ నామినేట్
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:41 PM
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు టీమిండియా స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ నామినేట్ అయింది. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షఫాలీ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల వన్డే ప్రపంచ కప్ నెగ్గి.. టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ అమ్మాయిలు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా అనూహ్యంగా జట్టులోకి వచ్చి అటు బ్యాట్‌తోనూ, ఇటు బాల్‌తోనూ మెరిసిన ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma).. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేటైంది.
సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఓపెనర్‌గా ఉన్న ప్రతికా రావల్ సెంచరీలతో మెరిసి అద్భుతంగా రాణించింది. అకస్మాత్తుగా ప్రతికా గాయపడటంతో అనూహ్యంగా షఫాలీ జట్టులోకి వచ్చింది. తొలి మ్యాచ్‌లో విఫలమైంది. కానీ సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో 78 బంతులు ఎదుర్కొని 87 పరుగులు చేసి సత్తా చాటింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ అనూహ్య నిర్ణయంతో బాల్ అందుకున్న షఫాలీ.. రెండు కీలక వికెట్లను నేలకూల్చి విజృంభించింది.
పోటీలో ఉన్నదెవరంటే?
ఐసీపీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం షఫాలీ వర్మతో పాటు యూఏఈకి చెందిన ఈషా ఓజా, థాయ్‌లాండ్‌కు చెందిన తిపట్చా పుట్టావాంగ్ నామినేట్ అయ్యారు. ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీలో ఓజా అద్భుత ప్రదర్శన చేసింది. ఏడు టీ20 మ్యాచుల్లో 137.50 స్ట్రైక్ రేట్‌తో 187 పరుగులు చేసింది. బంతితో ఏడు వికెట్లతో చెలరేగింది. అలాగే థాయ్‌లాండ్‌కు చెందిన స్పిన్నర్ తిపట్చా పుట్టావాంగ్ ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ టోర్నీలో 15 వికెట్లు సాధించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
టికెట్ల కోసం ఎగబడ్డ జనం.. వీడియో వైరల్
అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం.. రో-కోతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి