Ind Vs SA T20: టికెట్ల కోసం ఎగబడ్డ జనం.. వీడియో వైరల్
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:00 PM
కటక్ వేదికగా డిసెంబర్ 9 నుంచి టీమిండియా-సౌతాఫ్రికా జట్లు ఐదు టీ20ల సిరీస్ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు టికెట్ల కోసం కౌంటర్ల దగ్గర ఎగబడ్డారు. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ చాలా తక్కువ టికెట్లు మాత్రమే విక్రయానికి ఉంచిందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: డిసెంబర్ 9 నుంచి భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్ వేదికగా నిర్వహించనున్నారు. ఒడిశా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ తక్కువ సంఖ్యలో టికెట్లను కౌంటర్లలో విక్రయానికి ఉంచింది. ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయడానికి అభిమానులు పోటెత్తారు.
టికెట్ కౌంటర్లు తెరుచుకోకముందే ఉదయం నుంచి మైదానం బయట వేల సంఖ్యలో అభిమానులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. కౌంటర్లు తెరుచుకోవడమే ఆలస్యం.. టికెట్ల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాతో వైరల్ అవుతోంది. ఒడిశా క్రికెట్ అసోసియేషన్(Odisha Cricket Association) అధిక సంఖ్యలో టికెట్లను వీఐపీలకు కేటాయించి.. చాలా తక్కువ టికెట్లను మాత్రమే కౌంటర్లలో విక్రయానికి ఉంచిందని.. అందుకే ఈ సమస్య తలెత్తిందని ఆరోపణలు వస్తున్నాయి.
రేట్లు ఇలా..
టికెట్ల ధరలు రూ.700 నుంచి రూ.20,000 మధ్య ఉన్నాయి. అయితే ఫ్యాన్స్ కోసం తక్కువ సంఖ్యలో టికెట్లు మాత్రమే విడుదల చేసినట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాతో టీమిండియా టీ20 మ్యాచ్‌లు కటక్, ముల్లాన్‌పుర్, ధర్మశాల, లఖ్‌నవూ, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. అయితే ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకం కానుంది. మరోవైపు శనివారం భారత్-సౌతాఫ్రికా జట్లు మూడో వన్డేలో తలపడనున్నాయి. వైజాగ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా తొలి వన్డేలో టీమిండియా గెలుపొందగా.. రెండో వన్డేలో ప్రొటీస్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ విషయంలో కేఎల్ రాహుల్‌కు ఓ క్లారిటీ ఉంది: డేల్ స్టెయిన్
అందుకే ఐపీఎల్‌కు వీడ్కోలు.. తొలిసారి స్పందించిన ఆండ్రీ రస్సెల్