Share News

Andre Russell: అందుకే ఐపీఎల్‌కు వీడ్కోలు.. తొలిసారి స్పందించిన ఆండ్రీ రస్సెల్

ABN , Publish Date - Dec 05 , 2025 | 02:16 PM

కేకేఆర్ డేంజరస్ బ్యాటర్ ఆండ్రీ రస్సెల్ ఇటీవలే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై రస్సెల్ తొలిసారిగా స్పందించాడు. ఐపీఎల్‌లో ఫేడౌట్ అవ్వకముందే రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.

Andre Russell: అందుకే ఐపీఎల్‌కు వీడ్కోలు.. తొలిసారి స్పందించిన ఆండ్రీ రస్సెల్
Andre Russell

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండిస్ ఆల్‌రౌండర్, కేకేఆర్ డేంజరెస్ బ్యాటర్ ఆండ్రీ రస్సెల్(Andre Russell) ఇటీవలే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026కి కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని రిటైన్ చేసుకోలేదు. తర్వాత రస్సెల్ ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే కేకేఆర్(KKR) యాజమాన్యం అతడిని పవర్ కోచ్‌గా నియమించుకుంది. ఈ నేపథ్యంలో రస్సెల్ ఐపీఎల్ వీడ్కోలు నిర్ణయంపై తొలిసారి స్పందించాడు. ఎందుకు రిటైర్ అవ్వాల్సి వచ్చిందో వివరించాడు.


‘ఐపీఎల్ పెద్ద టోర్నీ. ఇందులో మ్యాచులు ఎక్కువ. ప్రయాణాలు కూడా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్, జిమ్, వర్క్‌లోడ్.. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం. ఆల్‌రౌండర్‌గా నాకు మరింత సవాలుతో కూడుకున్న పని. నేను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తే సరిపోదు. ఒక మ్యాచ్‌లో కనీసం రెండు ఓవర్లపాటు బౌలింగ్ చేయాలి. నేను చక్కగా బౌలింగ్ చేయగలిగాను అనుకున్నప్పుడే.. బ్యాటింగ్‌లో కూడా రాణించగలను. నేను కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చి.. సిక్సులు కొడితే సరిపోతుందనుకోను. బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేసినప్పుడే నేను ఆటను ఆస్వాదించగలను’ అని రస్సెల్ వివరించాడు.


ఆ ప్రశ్న వచ్చినప్పుడే..

‘హాయ్ కేకేఆర్ ఫ్యాన్స్. మీకు నేను ఓ విషయం చెప్పాలి. ఐపీఎల్ నుంచి నేను రిటైర్ అవుతున్నా. కేకేఆర్ నాకు ఎన్నో అవకాశాలను, జ్ఞాపకాలను ఇచ్చింది. ఈ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నప్పుడు ఇదే నా కెరీర్‌లో బెస్ట్ నిర్ణయం అవుతుందని అనిపించింది. నేను ఐపీఎల్‌లో ఫేడౌట్ అవ్వాలని అనుకోవడం లేదు. ఓ లెగసీని అందించి వెళ్లాలని అనుకున్నాను. ప్రేక్షకులు ‘రిటైర్‌మెంట్ అప్పుడే ఎందుకు’? అని ప్రశ్నించే రోజుల్లోనే రిటైర్ అవ్వడం ఉత్తమం అనేది నా భావన’ అని రస్సెల్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో వివరించాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాడూ.. వీడూ.. ఎవడు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం

Updated Date - Dec 05 , 2025 | 02:16 PM