Ravi Shastri: అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం.. రో-కోతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి
ABN , Publish Date - Dec 05 , 2025 | 03:22 PM
రో-కోకి హెడ్ కోచ్ గంభీర్‌కి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు వస్తోన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందించాడు. రో-కోతో పెట్టుకోవద్దని పరోక్షంగా సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. రో-కో 2027 ప్రపంచ కప్ ఆడుతారా? లేదా? అన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. తాజాగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌ల్లో ప్రదర్శనతో వాళ్లు తమను తేలిగ్గా పక్కన పెట్టలేని పరిస్థితిని కల్పించారు. మరోవైపు హెడ్ కోచ్ గంభీర్, సెలక్టర్ అగార్కర్‌లతో రో-కో అభిప్రాయభేదాలు వస్తున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.
‘ఆటలో వాళ్లిద్దరూ తాతలు. వైట్‌బాల్ దిగ్గజాలు. వాళ్లను అనవసరంగా కెలకొద్దు. వాళ్లకు చిర్రెత్తుకొచ్చిందంటే అందరూ దెబ్బ తింటారు. అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం. ఒకరు ఛేదనలో దిట్ట. ఇంకో ఆటగాడు వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదాడు. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి’ అని రవి శాస్త్రి వెల్లడించాడు.
కాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించగా.. రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే రెండు వన్డేల్లో విరాట్ కోహ్లీ వరుసగా సెంచరీలు బాదాడు. మరోవైపు రోహిత్ శర్మ తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ విషయంలో కేఎల్ రాహుల్‌కు ఓ క్లారిటీ ఉంది: డేల్ స్టెయిన్
అందుకే ఐపీఎల్‌కు వీడ్కోలు.. తొలిసారి స్పందించిన ఆండ్రీ రస్సెల్