Share News

KL Rahul: ఆ విషయంలో కేఎల్ రాహుల్‌కు ఓ క్లారిటీ ఉంది: డేల్ స్టెయిన్

ABN , Publish Date - Dec 05 , 2025 | 02:46 PM

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి రెండు మ్యాచుల్లో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ వరుసగా హాఫ్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. రాహుల్ నిలకడ ప్రదర్శనపై సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ స్పందించాడు.

KL Rahul: ఆ విషయంలో కేఎల్ రాహుల్‌కు ఓ క్లారిటీ ఉంది: డేల్ స్టెయిన్
KL Rahul

ఇంటర్నెట్ డెస్క్: భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ కొనసాగుతుంది. ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్‌లు ఆడేసిన ఈ టీమ్‌లు.. చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్న విషయం తెలిసిందే. రాంచీలో జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో టీమిండియా గెలిస్తే.. రాయ్‌పూర్ రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు మ్యాచుల్లోనూ కేఎల్ రాహుల్(KL Rahul) హాఫ్ సెంచరీలతో మెరిశాడు. మొదటి మ్యాచ్‌లో(60), రెండో మ్యాచ్‌లో(66*) పరుగులు చేశాడు. రాహుల్ నిలకడ ప్రదర్శనపై సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్(Dale Steyn) మాట్లాడాడు.


‘కెప్టెన్ కేఎల్ రాహుల్.. అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలుసు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితే.. కచ్చితంగా సెంచరీలు సాధించగలడు. కానీ ప్రస్తుతం అతడు ఆడుతున్న స్థానాల్లో జట్టు కోసం ఎలాంటి పాత్ర పోషించాలో అతడికి బాగా తెలుసు. రెండు వన్డేల్లోనూ అతడు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఎప్పుడు తగ్గాలో.. ఎప్పుడు వేగంగా ఆడాలనే విషయంపై కేఎల్ రాహుల్‌కు ఓ క్లారిటీ ఉంది’ అని డేల్ స్టెయిన్ ప్రశంసించాడు.


వన్డేల్లో ప్రదర్శన..

కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు వన్డేల్లో 83 ఇన్నింగ్స్ ఆడి 3,218 పరుగుల చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడు చివరిసారిగా వన్డే వరల్డ్ కప్ 2023లో నెదర్లాండ్స్ మీద సెంచరీ చేశాడు. ప్రస్తుతం కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా వన్డే జట్టుకు దూరమయ్యారు. దీంతో కేఎల్ రాహుల్ ఇప్పుడు ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా మూడో వన్డే విశాఖ వేదికగా శనివారం జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచి టీమిండియా సిరీస్‌ను పట్టేస్తుందా? లేదా? అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

వాడూ.. వీడూ.. ఎవడు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం

Updated Date - Dec 05 , 2025 | 02:46 PM