Share News

Steve Smith: స్టీవ్ స్మిత్ రికార్డ్.. ఆసీస్ తరఫున తొలి ప్లేయర్‌గా

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:50 AM

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డును సృష్టించాడు. యాషెష్ 2025 సిరీస్ లో భాగంగా రెండో టెస్టులో 63 పరుగులు చేశాడు. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ పిప్ లో అత్యధిక స్కోర్ చేసిన ఆసీస్ ప్లేయర్ గా స్మిత్ నిలిచాడు.

Steve Smith: స్టీవ్ స్మిత్ రికార్డ్.. ఆసీస్ తరఫున తొలి ప్లేయర్‌గా
Steve Smith

ఇంటర్నెట్ డెస్క్: యాషెస్(Ashes 2025) సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య బ్రిస్బేన్‌ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం మూడో రోజు ఆట కొనసాగుతోంది. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్స్ స్మిత్ (Steve Smith) చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(WTC)లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. యాషెస్‌ రెండో టెస్ట్‌ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు లబూషేన్‌ పేరిట ఉన్న రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు.


రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ 85 బంతుల్లో 61 పరుగులు చేశాడు. దీంతో ఈ అరుదైన రికార్డును స్మిత్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం లబూషేన్‌(Marnus Labuschagne) ఖాతాలో 4350 పరుగులు ఉండగా.. కేవలం 8 పరుగుల అదనంతో స్టీవ్‌ లో 4358 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా డబ్ల్యూటీసీ అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లాండ్‌ దిగ్గజం జో రూట్‌ పేరిట ఉంది. ప్రస్తుతం రూట్‌ ఖాతాలో 6226 పరుగులు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న స్టీవ్‌కు రూట్(Joe Root) మధ్య దాదాపు 2000 పరుగుల వ్యత్యాసం ఉండటం విశేషం.


బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న యాషెస్‌ రెండో టెస్ట్‌ హోరాహోరీగా సాగుతోంది. మూడో రోజు ఆట(శనివారం) ఆస్ట్రేలియా 99 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 447 పరుగుల వద్దలతో 113 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో మిచెల్ స్టార్ (46), స్కాట్ (7) ఉన్నారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో జేక్ వెదరాల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65), అలెక్స్(63), స్టీవ్ స్మిత్ (61) హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి టెస్టులో చెలరేగిన ట్రావిస్ హెడ్ 33 పరుగులకే పరిమితయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, స్టోక్స్ 3 వికెట్లు సాధించగా.. ఆర్చర్, గస్ అట్కిన్సన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగుల వద్ద ఆలౌటైంది. జో రూట్‌(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. జాక్ క్రాలీ(76),ఆర్చర్‌(38) రాణించారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

Seema Punia: సీమా పునియాకు భారీ షాక్.. 16 నెలల నిషేధం

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. షఫాలీ వర్మ నామినేట్

Updated Date - Dec 06 , 2025 | 11:56 AM